జయహో,,,, దిగ్విజయహో

జయహో,,,, దిగ్విజయహో,,,,,

జయించు ఈ ప్రపంచాన్ని అవలీలగా
నీ విద్యుక్త ధర్మాన్ని నియమబద్ధంగా నిర్వర్తిస్తూ
జయజయ ద్వానాలు మిన్నుముట్టేలా జైత్రయాత్ర సాగిస్తూ సాగిపో
కాంతిపుంజమై చెలరేగుతూ నీ చుట్టూ ఉన్న కారుచీకట్లను పారద్రోలుతూ చెలరేగిపో,,,,,,
విశ్వం నీ హృదయం నింపుకున్న చేతుల్లో ఓ ఆటబొమ్మ
పోరాడితేనే నిన్ను నీవు గెలిచేది
నీ బానిస సంకెళ్ళు తెగిపోయేలా శ్రమించు అకుంఠిత దీక్షతో,,,,,
నీ పూవుల రధానెక్కి జయహో దిగ్విజయహో అంటూ జనం కీర్తించేలా గెలుపే లక్ష్యంగా సాగిపో,,,,,
విజయాలపై విజయాలను చేజిక్కించుకుంటూ ముందుకు మున్ముందుకు పట్టువదలని విక్రమార్కునివి నీవేయై,,,,,,
నీ మార్గంలో దుష్టులను దునుమాడుతూ ఎగబ్రాకు ఎవరెస్టు శిఖరంపై జండా పాతు,,,,,
అకుంఠిత దీక్షా శ్రమలతోనే ధిక్కార దిగ్విజయాలు సొంతమయేది గుర్తుంచుకో,,,,,
ఓ నూతన అధ్యాయం నీ విజయాలను చరిత్రలో లిఖించలా విశ్రామం లేకుండా దీక్షాపరునివై ఈ లోకాల నాలుకలపై ఆడేలా శోభిళ్ళు,,,,,
ఆకలి దప్పికలు మరచి కష్టాలు కన్నీళ్లకు వెరచి బండల గుండెలతో అడ్డూ అదుపు లేకుండా బహుదూరపు బాటసారివై మహోన్నత శిఖరాలపైకి సాగిపో జనం ఆశ్చర్యంతో నీ నామం జపించాలి ఆదర్శంగా,,,,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *