జరుగుతున్న అకృత్యాలు ,వాటి పరిష్కారాలు ఈ అంశం పై మీ రచనలు పంపగలరు..5/10/2025] అపరాజిత్ సూర్యాపేట ఎగిరిపో ఓ పక్షి,,,,,,,!

గూడు చెదిరే గుండె పగిలే
ఎగిరిపో ఓ పక్షీ,,,,,,,!
వికృతటాట్టహాసాల మనుష్యుల జీవన సరళిలో మనలేక,,,,,,,,
ఎగిరిపో ఓ పక్షీ,,,,,,,!
కంటి నిండా నిద్దుర కరువై
నీ చిన్ని గుండె గుబగుబలాడుతూ
దరిత్రి నిండా విషవాయువుల పెనుభూతాలు భయం గొల్పుతూ,,,,,,
కారడవులు నిట్టనిలువుగా కూల్చిన నరలోకంలో ఇమడలేక కన్నీరు మున్నీరవుతూ,,,,,,,,
ఎగిరిపో ఓ పక్షీ,,,,,,,!
గబ్బిలాలను కూడా వదలకుండా భక్షించే నరరూప రాక్షసుల మధ్య జీవించలేవు విహంగమా,,,,,,,,
ఎగిరిపో ఓ పక్షీ,,,,,,,!
తమను కన్న తల్లిదండ్రులనే హతమార్చే కిరాతకులు నరులు,,,,,,
ఎగిరిపో ఓ పక్షీ,,,,,,,!
ఆకలి దప్పికలు మరచి ఎన్నాళ్ళయిందో ఈ కారుచీకట్ల గోడల మధ్య గోప్యత లేని విశృంఖల జీవులలో ఇమడలేవు తల్లీ,,,,,,,,,
ఎగిరిపో ఓ పక్షీ,,,,,,,,!
చెరబడుతున్న ఆడపిల్లల ఆర్తనాదాల హింసా ప్రవృత్తుల గగ్గోలులు ప్రతినిత్యం నీకు ఇక్కడ స్వేచ్ఛ కల్పించే వాడేడి,,,,,,,,
ఎగిరిపో ఓ పక్షీ,,,,,,,!
సుభిక్ష భారతంలో ఆకలికి అల్లల్లాడుతున్న అనాధ లెందరో,,,వల్లమ్ముకుంటూ పూట గడుపుతున్న నిర్భాగ్యుల గోస చూడతరమా,,,,,,,,,,,
ఇది చీకటి ముసురుకున్న రాజ్యం అజ్ఞాతంలో మానవతావాదులు నిన్ను నిన్నుగా బ్రతకనివ్వని బ్రతుకు వేట జనులు,,,,,,,,
ఎగిరిపో ఓ పక్షీ,,,,,,,,,!
ఏ సుందర వెలుగు పూల ప్రపంచానికో పిల్లాపాపలతో దివ్య మంగళ రూపసివై గగనం నిండా నీవై పృద్వి ఉన్నంత కాలంలో కాలానివై జీవించు తల్లీ నిన్ను కన్నపేగు సాక్షిగా,,,,,, ,,,,,,,
ఎగిరిపో ఓ పక్షీ,,,,,,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *