జాతీయ గణిత దినోత్సవం

జాతీయ గణిత దినోత్సవం

జాతీయ గణిత దినోత్సవం

జాతీయ గణిత దినోత్సవం డిసెంబరు 22న దేశవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

2012 ఫిబ్రవరి 26న మద్రాస్ విశ్వవిద్యాలయంలో జరిగిన రామానుజన్ 125వ జయంతి ప్రారంభ వేడుకల్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు.

డిసెంబరు 22న దేశవ్యాప్తంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాలలో విద్యా కార్యక్రమాలతో జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటారు. సంఖ్యాశాస్త్రంలో రామానుజన్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 1962వ సంవత్సరంలో రామానుజన్ 75వ జన్మదినం నాడు స్మారక తపాలా బిళ్ళను విడుదల చేయడమేకాకుండా 125వ జయంతి సందర్భంగా 2012ను జాతీయ గణితశాస్త్ర సంవత్సరంగా ప్రకటించింది. 2017లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా లోని కుప్పంలో రామానుజన్ మఠ్ పార్క్ ప్రారంభించబడింది.

గణితం అన్ని శాస్త్రాలకు తల్లి వంటిది. గణిత శాస్త్రం లేకుండా ఈనాడు ప్రపంచం ఏ రంగాలలోను ముందంజ వేయలేదు. దైనందిన సమస్యల పరిష్కారానికి గణితం ఎంతో ఉపయోగపడుతుంది, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎక్కడ ఏ పరిశోధనలకు గణితమే ప్రాతినిధ్యం వహిస్తున్నది. గణితం కృత్రిమ మేధ ( ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్) బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్, సైబర్ భద్రత, క్రిప్టోగ్రఫీ వంటి వివిధ రంగాలలో కొత్త పరిశోధనలకు, సమస్యల పరిస్కరానికి గణితమే ప్రధానం. గణితముతో సమస్యలను అధిగమించి, పరిష్కరించి అన్ని సాంకేతిక రంగాలలో వినూత్న మార్పులు శాస్త్రజ్ఞులు తేవటం జరుగుతుంది.

ప్రపంచములో గణితం నిరంతరం మారుతున్న రంగాలలో వ్యాపారాలు, ప్రభుత్వాలు తమ నిర్ణయాలు తీసుకోవడానికి గణిత నైపుణ్యంపై ఆధారపడతాయి. ఆధునిక ప్రపంచంలో గణిత నైపుణ్యం అత్యంత సాధారణ అనువర్తనాలు వ్యాపారం, ఆర్థిక (ఫైనాన్స్ ) ఇంజనీరింగ్ లో ఉన్నాయి. వ్యాపారంలో, ఆర్థిక నిష్పత్తులు, ప్రకటనలను లెక్కించడానికి, సమాచారం (డేటా) విశ్లేషించడానికి, భవిష్యత్తు ఆర్థిక ధోరణులను అంచనా వేయడానికి గణిత నైపుణ్యాన్ని ఉపయోగిస్తారు. ప్రపంచములో అందరు ఏదో ఒక రూపంలో గణితం తమ జీవితాలలో వాడటం జరుగుతుంది.

భూమి వాతావరణం, గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని బాగా అర్థం చేసుకోవడానికి పరిశోధకులను అనుమతించడం ద్వారా గణితశాస్త్రం వాతావరణ మార్పుల అధ్యయనానికి గణనీయమైన సహకారం అందించింది. అంటు వ్యాధులు, వాటి మూలాలు, వాటి వ్యాప్తి, నియంత్రణకు సంబంధించి భూమి లోని సహజ వ్యవస్థల డైనమిక్స్ను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.

ప్రపంచంలో గణితం సామజిక రంగాలలో (సోషల్ స్టడీస్) లో భాగంగా ఉంది, ఎందుకంటే దేశం సామాజిక అంచనాలు లెక్క గట్టడానికి, అన్వేషించడంలో సహాయపడుతుంది, ఆదాయ అసమానత, రాజకీయ ధ్రువీకరణను గుర్తించడంలో సహాయపడుతుంది. గణిత డేటాను ఉపయోగించి వారు అంతర్లీన నమూనాలను గుర్తించగలరు, భవిష్యత్తు ధోరణులను మరింత కచ్చితంగా అంచనా వేయవచ్చు.

గణితం ప్రతి అంశం లేదా రూపం ప్రతిరోజూ మన జీవితాలను ప్రభావితం చేస్తుంది. ప్రజలు పనిచేసే రంగంలో, అది వైద్యం, వాతావరణ శాస్త్రం లేదా క్రిప్టోగ్రఫీ మొదలైన వాటిలో మీరు ఎల్లప్పుడూ దాని ప్రభావాన్ని చూస్తాము. అంతరిక్షంలో జీవం యొక్క సంభావ్యతను నిర్ణయించడానికి వ్యోమగాములు దీనిని ఉపయోగిస్తారు, గణాంక శాస్త్రవేత్తలు జనాభా ధోరణులను అంచనా వేయడానికి సమాచారం (డేటా) పై ఆధారపడతారు, ఒక సంస్థ బాగా పనిచేస్తోందా లేదా నష్టాలను కలిగిస్తుందో తెలుసుకోవడానికి అకౌంటెంట్లు దీనిని ఉపయోగిస్తారు. గణితం లేకపోతే ప్రపంచం పురోగతి సాధించలేదు అని చెప్పవచ్చును.

శ్రీనివాస రామానుజన్ వారసత్వం గణిత శాస్త్రంలో అనంతమైన కృషి, ముఖ్యంగా సంఖ్యా సిద్ధాంతం, అనంత శ్రేణులు, నిరంతర భిన్నాలు, మరియు మాక్ థీటా ఫంక్షన్లలో విప్లవాత్మక సిద్ధాంతాలు, సూత్రాలు; ఆధునిక గణితం, కంప్యూటర్ అల్గారిథమ్‌లు, స్ట్రింగ్ థియరీ, క్రిప్టోగ్రఫీ వంటి రంగాలలో ఇప్పటికీ ఉపయోగపడుతున్నాయి; ఆయన పేరు మీద “రామానుజన్ మెషిన్” వంటివి వచ్చాయి; ఆయన అకాల మరణం తర్వాత కూడా పరిశోధకులకు స్ఫూర్తినిస్తూ, ప్రపంచవ్యాప్తంగా గణితానికి కొత్త మార్గాలు తెరిచారు.

మాధవి కాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *