జానపద గీతం

కాళ్ళ కడియాలు తెస్తా కంచిపట్టు చిర తెస్తా ఓ ……. చిన్నదానా జోన్నచెను కోయరావేమే 2 ,,,, కాళ్ళ కడియాలు వద్దు కంచి పట్టు చిర వద్దు 2 ….. ఓ …… చిన్నవాడా జోన్నచెను కోయరానోయి 2… ముక్కుకి ముక్కెర తెస్తా , మువ్వాకు కోక తెస్తా 2 …. ఓ ….. చిన్నదానా జొన్న చేను కోయరావేమే … ముక్కుకి ముక్కెర వద్దు , మువ్వాకు కోక వద్దు ఓ ,,,, చిన్నవాడా జోన్నచెను కోయారానోయి ….2 ……చేతులాకు గాజులు తెస్తా ,చెవుల లోలకులు తెస్తా 2…. ఓ ….. చిన్నదానా జోన్నచెను కోయరావేమే …2 చేతులాకు గాజులు వద్దు ,,,చెవుల లోలాకులు వద్దు ఓ ,,,,,, చిన్నవాడా జోన్నచెను కోయరానోయి 2….. కొత్తసినిమా చూపిస్తా కొంగుపట్టుకు నేనుంటా ,2……ఓ చిన్నదానా జోన్నచెను కోయారావేమే …. 2 … కొత్తసినిమా చూపిస్తే …కొంగుపట్టుకు నువ్వుంటే 2 ఓ ….. చిన్నవాడా జోన్నచెను కోయవస్తానోయి ఓ …… చిన్నవాడా జోన్నచెను కోయవస్తానోయి ……….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *