జార్జ్ ఆర్వెల్(బ్రిటీష్ రచయిత)

ఎరిక్ ఆర్థర్ బ్లెయిర్ ఒక ఆంగ్ల నవలా రచయిత, కవి, వ్యాసకర్త, విలేకరి, విమర్శకుడు(ఎరిక్ ఆర్థర్ బ్లెయిర్ ,1903 జూన్ 25 , మోతీహరీ, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా –
1950 జనవరి 21 (వయసు: 46)
లండన్, ఇంగ్లండు). ఈయన జార్జ్ ఆర్వెల్ అనే కలం పేరుతో రచనలు చేశాడు. ఇతని రచనలు సరళ వచనం, సాంఘిక విమర్శ, నిరంకుశత్వం పట్ల వ్యతిరేకత, ప్రజాస్వామ్యం పట్ల సానుకూలత కలిగి ఉంటాయి.

ఎరిక్ ఆర్థర్ బ్లెయిర్ జూన్ 25, 1903 లో అప్పటి బ్రిటిష్ ఇండియా, బెంగాల్ ప్రెసిడెన్సీ లోని మోతీహారి లో (ప్రస్తుతం బీహార్) జన్మించాడు. తమది ఒక ఎగువ మధ్యతరగతి కుటుంబం అని ఆర్వెల్ చెప్పుకున్నాడు. ఇతని తండ్రి రిచర్డ్ వామస్లీ బ్లెయిర్ బ్రిటిష్ ప్రభుత్వంలో ఇండియన్ సివిల్ సర్వీస్ లో ఓపియం విభాగంలో పనిచేసేవాడు. ఈ విభాగం ఓపియం ఉత్పత్తి, భద్రపరచడం, చైనాకు సరఫరా చేస్తుండేది. ఇతని తల్లి ఇడా మేబెల్ బ్లెయిర్ బర్మాలోని ఒక ఫ్రెంచ్ వ్యాపారవేత్త కూతురు. ఎరిక్ కి ఒక సంవత్సరం వయసులోనే అతని అక్క మేర్జరీతో పాటు ఇంగ్లాండుకు తీసుకువెళ్ళింది.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *