నువ్వు నువ్వుగా విప్లవిస్తే, జ్వలిస్తే
వెలుగవు తావు,కాంతి కిరణమౌతావు……
అంతర్గత చేతనా రూపమేదో
నిన్నావరించి,ఆవహించి
ముందుకు నడిపిస్తుంది……
గుంపులో వెళితే
పాంధుడు అవుతావు….
ఒంటరిగా కొత్తగా వినూత్న ఆవిష్కరణలేవో చేస్తే
ప్రత్యూష సూర్యుడై
ప్రత్యేకత చాటుకుంటావు…..
పద్యాన్ని వదిలి,
పద్యం క్యూలైనును వదిలి
వచనం,విప్లవ ప్రవచనం
మరోప్రపంచం
బాటపట్టాకే కదా……..
శ్రీరంగం శ్రీనివాసరావు
శ్రీశ్రీ అయ్యాడు………!
శ్రీశ్రీ యుగాన్నీ.,జగాన్ని ఆవిష్కరించాడు……..!!
🩷
🩷 ఆచార్య పాయసం సుబ్రహ్మణ్య మహర్షి
9490125878
🌹
19_12_25