✒ 1891: తెలుగునాట మొట్టమొదటి వితంతు పునర్వివాహం కందుకూరి వీరేశలింగం పంతులు ఆధ్వర్యంలో, రాజమండ్రిలో జరిగింది.
✒1911: నేపాల్ రాజు త్రిభువన్ అధికారంలోకి వచ్చాడు.
✒1946: భారత రాజ్యాంగ పరిషత్తు అధ్యక్ష ఎన్నికలలో రాజేంద్ర ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనాడు.
✒1946: ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునిసెఫ్ అమలులోకి వచ్చింది.
✒1965: హైదరాబాదు లోని రామచంద్రాపురంలో బి.హెచ్.ఇ.ఎల్ కర్మాగారాన్ని, నాటి భారత ప్రధానమంత్రి, లాల్ బహదూర్ శాస్త్రి ప్రారంభించాడు.
✒1967: పశ్చిమ భారతదేశములో వచ్చిన భూకంపము వలన 170 మంది మరణించారు. ఆ భూకంపము తీవ్రత రిక్టర్ స్కేలు పై 6.5గా నమోదు అయ్యింది.
✒1882: సుబ్రహ్మణ్య భారతి, తమిళ కవి, స్వాతంత్ర్యయోధుడు. (మ.1921).
✒1864: సత్తిరాజు సీతారామయ్య, దేశోపకారి, హిందూసుందరి, లా వర్తమాని మొదలైన పత్రికలను నడిపిన పత్రికా సంపాదకుడు. (మ.1945).
✒1896: గ్రంధి మంగరాజు, సినిమా పంపిణీదారుడు, నిర్మాత.
✒1922: దిలీప్ కుమార్, భారతీయ చలనచిత్ర నటుడు,నిర్మాత,దర్శకుడు,రాజకీయ నాయకుడు.
✒1931: ఓషో, భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. (మ.1990).
✒1934: సలీం దుర్రానీ, భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
✒1935: ప్రణబ్ ముఖర్జీ, భారత 13 వ రాష్ట్రపతి.
✒1948:రఘువరన్, దక్షిణ భారతదేశానికి చెందిన నటుడు. (మ.2008).
✒1966: బెనెడిక్టా బొక్కొలి, ఇటాలియన్ సినిమా నటి.
✒1967: మునిమడుగుల రాజారావు, తాత్విక రచయిత.
✒1969: విశ్వనాథన్ ఆనంద్, భారత చదరంగ క్రీడాకాకారుడు.
✒1995: నభా నటేష్, కన్నడ, తెలుగు, చలన చిత్ర నటి, మోడల్.
✒1756: థియోడోర్ వాన్ న్యుహాఫ్ జర్మన్ సాహసికుడు. కింగ్ ఆఫ్ కోర్సికా. (జ.1694).
✒1783: రఘునాథరావ్, మరాఠా సామ్రాజ్యానికి చెందిన 13వ పేష్వా. (జ.1734).
✒1967: మెహర్ చంద్ మహాజన్, భారతదేశ మూడవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1889).
✒2004: ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, భారతదేశ గాయని. (జ.1916).
✒2011: మల్లెమాల సుందర రామిరెడ్డి, తెలుగు రచయిత, సినీ నిర్మాత. (జ.1924).
✒2013: శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్, మైసూర్ రాజ కుటుంబం యొక్క వారసుడు. (జ.1953).
✒2015: హేమ ఉపాధ్యాయ, మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కళాకారిణి, (జ.1972).
✒2016: పి.వి. రాజేశ్వర్ రావు: రాజకీయ నాయకుడు, మాజీ ఎంపి. (జ. 1946).
మాధవి కాళ్ల
సేకరణ