డిసెంబర్ 22 ప్రత్యేకతలు :-
✒ సంవత్సరంలో అతితక్కువ పగటి సమయం ఉండే రోజు (Winter Solstice). ఐతే, ఇది ఉత్తరార్ధగోళానికి మాత్రమే పరిమితం. దక్షిణార్ధ గోళంలొ ఇది జూన్ నెలలో సంభవిస్తుంది. మరో విషయం ఏమంటే, ఈరోజు కొన్ని సంవత్సరాలలో డిసెంబరు 21న లేదా 22న కూడా కావచ్చును.
భారతదేశంలో జాతీయ గణిత దినోత్సవం.
✒1666: సిక్కుమత పదవ గురువు గురు గోవింద సింగ్ జననం (మ.1708).
✒1853: ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస భార్య,యోగిని, శారదా మాతగా ప్రసిద్ధిచెందిన శారదా దేవి జననం (మ.1920).
✒1887: గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జననం (మ.1920).
✒1899: వైద్యశాస్త్ర ప్రముఖుడు శొంఠి దక్షిణామూర్తి జననం (మ.1975).డిసెంబర్ 22 ప్రత్యేకతలు :-
✒1932: భారత దేశానికి చెందిన ఆర్థిక వేత్త, రిజర్వ్ బ్యాంకు గవర్నరుగా పనిచేసిన సి.రంగరాజన్ జననం.
✒1947: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు దిలీప్ దోషి జననం (మ.2025).
మాధవి కాళ్ల