లోకం నిండా వెలుగుల వర్షం కురుస్తుంటే నేను నిద్దరోయాను. నిశిరాత్రి ముసురుకొస్తుంటే నేను మేల్కొని పూవులలో నక్షత్రాల తళుకులు ఆశ్చర్యంగా వీక్షిస్తూ,నా కళ్ళల్లో నెలవంకను పుష్పిస్తూ వెర్రినై గుబులు గూళ్ళలోని పక్షులు కునుకుపాట్లను మరచి నావైపు వింతప్రాణిలా తొంగిచూస్తూ విస్తుపోతున్నాయి.ఆకాశం నుండి సన్నసన్నని చినుకులు రాలుతూ తన్మయత్వంలో నేను నర్తిస్తూ నన్ను నేను మైమరచాను.ఈ లోకంలో నేను వెర్రిని అయినా పర్లేదు.
అపరాజిత్
సూర్యాపేట