తిక్కకుదిరింది

నాకు తల తిక్కపట్టింది
దేవుళ్లలో ఎవరు గొప్పవాడు!?
అనుకున్నది తడవుగా
శివుడి దగ్గరకెళ్లా
నంది సద్దు చేయకన్నాడు….
ఎదురుగా శివుడు విష్ణుపూజలో మమేకమై ఉన్నాడు…….
సరీసరి అనుకుంటూ
విష్ణువు దగ్గరి కెల్లా……
గరుడుడు నోటిమీద వేలు చూపించాడు……
నమస్కరించి ఎదురుగా చూశా….
నల్లనయ్య శివపూజలో
నిమజ్ఞమై ఉన్నాడు
సరి సరి అనుకుంటూ
గురువు సలహాకోసం
శంకరాచార్యుల దగ్గరికి వెళ్ళా
ఆయన రామానుజాచార్యులతో
కలిసి రామయ్య సేవలోఉన్నాడు…….
సరేసరి అనుకుంటూ
రామానుజాచార్యులు దగ్గరికెళ్లా…..
ఆశ్చర్యం……
అక్కడ వారు శంకరాచార్యులతో కలిసి ముక్కంటి పూజలో ఉన్నారు…….
ఇక నాకు తిక్క కుదిరింది…..
సనాతనం అంటే ఒక ధర్మాన్నీ
మరొకరు గౌరవించుకోవడం…..!
దీపం పరం బ్రహ్మ స్వరూపమని……
ముక్కోటి దేవతలు అందరూ
పరబ్రహ్మ రూప ప్రతిరూపాలని………,
ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం!
ధర్మాన్ని సాక్షీభూతం చేసి
ప్రశ్నించే జ్ఞానికి
ఆదిశంకరులే సాష్టాంగ పడ్డారని అర్థం చేసుకోవడం………………………….!

జ్ఞానోదయ మయ్యాక
ఇక….నాకు తిక్కకుదిరింది
కళ్ళు తెరిచి చూస్తే
ఇంట్లో పరుపుపై వున్నాను!!
🩷
🩷 ఆచార్య పాయసం సుబ్రహ్మణ్య మహర్షి,
9490125878

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *