అక్షర కొరకు
అంశం :- నేటి పిల్లల ప్రవర్తన,సామాజిక బాధ్యతలు
తేది:- 13/12/2025
శీర్షిక:- తియ్యని విషం
రేపటి పౌరులు నేటి పసిమొగ్గలు
కళ్ళ నిండా మెరిసే కాంతుల సిరులు
వారి ప్రవర్తనలో మార్పుల గమనం
చూస్తే గుండెల్లో రేగే అలజడి ధ్వానం
తియ్యని విషపు వలలో (గంజాయి, డ్రగ్స్)
అలవాటు కాని అలవాటు తీయని విషం
ఒక్కసారి చవిచూస్తే పడేదే కదా శాపం
రంగుల ప్రపంచమది అంతా భ్రమే కదా
మెదడును నాశనం చేసే మాయరోగం కదా
క్షణం సేద తీరినట్లు అనిపించే మత్తు
జీవిత గమనాన్నే మారుస్తుంది హత్తు
దొంగచాటుగా సాగే ఈ చీకటి పయనం
పిల్లల భవిష్యత్తుకు పెద్ద నిరాశ్రయం
మొదట సరదాగా మొదలయ్యే చిన్న బీజం
మెల్లమెల్లగా మారుతుంది పెను వ్యసనం
తల్లిదండ్రుల కళ్లల్లో నింపుతుంది నీరు
సమాజాన్ని ప్రశ్నిస్తుంది ఈ దుస్థితి వేరు
ప్రవర్తనల మార్పు బాధ్యత మాయం
ఏకాగ్రత చెదరి చదువుపై విరక్తి
కోపం ఆవేశం మాటల్లో చిరాకు భక్తి
నిజాయితీ మరుగున పడి అబద్ధమే రాజ్యం
సామాజిక బాధ్యతకు దొరకదు మార్గం
ముందుకు నడిచే శక్తిని లాగేస్తుంది మత్తు
తల దించుకునేలా చేస్తుంది ఈ దురలవాటు హత్తు
స్నేహితుల ఒత్తిడికి లొంగే బానిస బతుకు
ఎటూ కాకుండా పోయే నిర్లక్ష్యపు చిక్కు
మన సామాజిక బాధ్యత నిజమైన ప్రేమను పంచాలి పిల్లలకు
ఆదరణ మార్గదర్శకత్వం అందించాలి వాళ్లకు
ప్రతి పౌరుడు ఈ పోరులో సైనికుడే
మత్తును తరిమేసేందుకు మేల్కొలుపు పలుకుడే..
వారికి ఆశ చూపాలి భవిష్యత్తుపై దృష్టి
కలలు కనే ధైర్యాన్ని ఇవ్వాలి తుష్టి
వ్యసన ముసుగును చీల్చి కొత్త జీవితం ఇవ్వాలి,
ఆరోగ్యకరమైన తరాన్ని మనం స్వాగతించాలి…
మాధవి కాళ్ల..
హామీ పత్రం :-
ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను..