తిరుమల శ్రీనివాసాచార్య 1938, జనవరి 1 న రాజన్న సిరిసిల్ల జిల్లా, యల్లారెడ్డిపేట్ మండలం, నారాయణపూర్ గ్రామంలో తిరుమల మనోహరాచార్యులు వేంకటమ్మ దంపతులకు జన్మించాడు. ఎం.ఏ. పట్టభద్రుడు. ఆంధ్రోపన్యాసకునిగా పనిచేసి 1995లో పదవీ విరమణ చేశాడు.
రచనలు
జీవనస్వరాలు (ఖండకావ్యము – 1971)
గంగాతరంగాలు (లలితగీతాలు – 1992)
కావ్యపుష్కరిణి (పద్యకవితా సంపుటి -2001)
వ్యాసోల్లాసం (సాహిత్య వ్యాస సంపుటి -2002)
ప్రపంచవిపంచి (పంచపదుల సంకలనం – 2004)
పురస్కారాలు
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు (1982)
వానమామలై వరదాచార్య స్మారక పురస్కారం (1989)
అభినవ పోతన సాహితీ సాంస్కృతిక సమాఖ్య వారి జీవన సాఫల్య పురస్కారం (2013)
తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారం (1996), (2013)
ఆం.ప్ర. కళాశాల ఉత్తమ ఉపన్యాసక పురస్కారం
‘కలహంసి’ బాబయ్య స్మారక పురస్కారం (1993)
శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం వారిచే మహాకవి దాశరథి స్మారక పురస్కారం (1997)
అరుంధతి కళా సంస్థ వారిచే మహాకవి దాశరథి స్మారక పురస్కృతి (1998)
రసమయి పురస్కారం (2000),(2005),(2011)
రాయప్రోలు ‘వంశీ-రత్న’ స్వర్ణపతక పురస్కారం (2002)
బి.లక్ష్మీకాంతరావు స్మారక పురస్కారం (2002)
నాదెళ్ల లక్ష్మమ్మ స్మారక పురస్కారం మొదలైనవి (2004)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారాలు వృష(2001),పార్థివ(2005),వ్యయ(2006),సర్వజిత్(2007),ఖర(2011)
డా. ఇరివెంటి కృష్ణమూర్తి స్మారకపురస్కారం (2007)
డా. అందె వేంకటరాజము స్మారక సాహిత్య పురస్కారం (2007)
డా. [[దివాకర్ల వేంకటావధాని]] స్మారక పురస్కారం (2008), జీవిత సాఫల్య పురస్కారం (2012)
కవిరత్న నీలా జంగయ్య సాహితీ పురస్కారం (2009)
డా. సి.నారాయణ రెడ్డి సాహితీ పురస్కారం (2010)
నండూరి రామకృష్ణమాచార్య సాహితీ పురస్కారం (2011)
బి.ఎన్.రెడ్డి సాహితీ పురస్కారం (2012)
దాశరథి సాహితీ పురస్కారం (2015) – తెలంగాణ ప్రభుత్వం.
మాధవి కాళ్ల
సేకరణ