ఒక వయస్సు దాటాక
ఫలించని కోరికలకు సమాధి కట్టి
ఉవ్వెత్తున ఎగిసిపడే ఆవేదనలను అణచివేసి,,,,
మనస్సు పడే టార్చర్ లను కసితీరా చంపుకుని,,,,
మాత్రలతో మనస్సును గుమ్ముగా సంవేదనల ఆలోచనలను ఆదుపుచేసుకుంటూ,,,,,
అక్షరాలు బోధించు బడిపంతులుగా పదవీవిరమణ పొందే దిశగా,,,,,
సాగిపోతున్న జీవిత రథచక్రాలు అలసిసొలసి గతితప్పిన బాటసారిని,,,,,
కాలం వడివడిగా ఋతుమార్పులతో పరుగెత్తుతూ వెనక్కి చూడని నైజం,,,,,
ఈ మనిషి మనస్సు గూడు గుభేల్మని కూలుతూ దడపుట్టించే గుండెకోతల చప్పుడు కనీవినీ ఎరుగని రోధనల పైశాచిక గీతాలు కళ్ళల్లో తిరుగుతూ,,,,,,
ఎన్నెన్ని సుప్రభాతాలు,ప్రకృతి అందాలను ,ఇంతులు చేమంతులని వర్ణించిన తనువు నిండా ఎన్నెన్ని గాయాల వ్రణాల లోయలో, ఎన్నెన్నో అగ్నిపర్వతాలు బద్దలై కన్నీటి రక్తం ఎగజిమ్ముతూ గుండెలవిశిపోయే ఎడారి మంటలు ఎవరికి తెలుసు?,,,,,,,
గుండెలు చించుకుని అక్షరాలు లిఖిస్తే తరలివెళ్లే కాలంలో ఎప్పుడు కలిసిపోయి కనిపించకుండా పోతానో, నా కలల కళాపూదోట ఎప్పుడు వాడిపోయి ఎడారి ఇసుక మేటలు కప్పేస్తాయో ఎవరికి తెలుసు ?,,,,,,,,
నేను వెళ్లేప్పుడు గుప్పెడన్ని పూవులు, నక్షత్రాల మూట బుజానేసుకుని కాలం మింగేసిన కలం చెవిలో పెట్టుకుని వెళ్తాను అక్షరాల అలలు లిఖించడానికి,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట