తెలపకపోతే ఎలా,,,,,,,,,!

హృదయం తలపులు తెరిచి
ఆకాశంలో ఎగిరే పక్షిలా తేలిపోతూ
కోవెళ గంటల గణ గణలలో
మనసు చేసే గారడీ గతంలో
ప్రేమించిన ప్రియురాలి చూపుల వలలో
చిక్కిన ప్రతిసారి హృదయం నిండా
పెల్లుబుకుతున్న ప్రేమాణుభూతులు!
చిక్కుల ఆల్లికల సామాజిక సంబంధాల్లో
మనోహరి నగుమోము కనిపించగానే
ఏదో తెలియని వింత కళ్ళల్లో కళ్ళు కలుపుతూ!
చదివిన నవలలోని నాయకిలా
అద్భుతంగా నెలవంక రూపసి
చదువుల దీపాన్ని ఆర్పేసుకుని
కన్నె గులాబీ చంద్ర బింబాన్ని
హృదయపు అద్దంలో నిలుపుకుని
లేతప్రాయపు యవ్వన పొంగులో
తెలిసీ తెలియని వయసులో
ఆడపిల్ల మనసు గెలిచానని గర్వం
ఎటువంటి ఆర్థిక వెసులుబాటు లేని నేను
నా మనసుకు నేనే గిరిగీసుకుని
కళ్ళు కలుపుతూ కలవరింతల్లో నేను
చదువుల సరస్వతిని దూరం చేసుకుని
ఆ సురభామిని అందాలు నిండుగా హృదయం నిండా!
మాటామంతీ లేని కేవలం కళ్ళు కలబడటమే
హృదయారాధ్యాన్ని తెలపకపోతే ఎలా,,,,,,,,! పొరపాటు,,,,,
ఇరువురి కళ్ళల్లో పూచిన ఎర్ర గులాబీలు
జీవిత పర్యంతం తలపుల్లో తట్టి లేపుతూ,,,,,,,!

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *