నేతలనెదిరించగ వచ్చు నేర్పుతోడ
పదవినైన వీడగ వచ్చు పట్టుబట్టి
తల్లిదండ్రి గురులపైన దాడి తగదు
తెలుసుకోవయ్య కృష్ణయ్య తెలివితోడ!!
కూటినెదిరించబోకుము కోపమున్న
కులమత వివక్ష జూపకు కోరికోరి
కూడు లేదని వీడకు కూర్మినెపుడు
తెలుసుకోవయ్య కృష్ణయ్య తెలివితోడ!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!