తొలి గజల్
పలకబట్టుచు బడిలోన
చేరినారు విద్యార్థులు!
అక్షరాలు దిద్దుకొనుచు
మురిసినారు విద్యార్థులు!!
గురుల మాట నిలబెట్టగ
చదివినారు గొప్పగాను!
ఉద్యోగము వేటలోన
తిరిగినారు విద్యార్థులు!!
దేశభక్తి చాటగాను
కదిలినారు విద్యార్థులు!
భరతమాత గౌరవాన్ని
నిలబెట్టిరి విద్యార్థులు!
తోటివారి మేలుగూర్చ
పాటుబడిరి బ్రతుకునంత!
గురు శిష్యుల బంధమ్మును
నిలిపినారు విద్యార్థులు!!
తలిదండ్రుల మాటకొరకు
పెళ్ళిపీట లెక్కినారు!!
వారసులను అందించుచు
పెంచినారు విద్యార్థులు!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట