దయలేని పూవులు,,,, ,!!

పుప్పొడి రేణువుల ఆకర్షణతో
వికసించిన పూవులలోని మకరందాలను
ఆస్వాదిస్తూ మౌన రాగాలు తీసే తుమ్మెదా,,,,,,
ఎన్నెన్ని అందాలు చిందించే పూవులలోని
విరితేనీయలు జివ్వుమని తాగేశావో,,,,,,,!
నింగిలోని చందమామ కంటే అందాలొలికే గుభాళించిన పూవులు
నిన్ను గమనించిగానే మైమరచి సోలిపోతూ
తమ తనువులోని అణువణువూ పులకరించిపోగా
వికసించి విప్పారిన పూవులన్నీ
నీకోసం తమ సోయగాలను అర్పించే మైకంలో
తదుపరి ఎన్నెన్ని కష్టాలు పడాలో మరచిపోయిన వెర్రిలో
కన్నెపూవులన్నీ నీ కోసం తపించి తనువులు అర్పిస్తూ
జీవన సోయగాలలోని తేనీయలు త్రాగితున్న తుమ్మెదా,,,,,,,
నీ తనువు కురూపిగా ఉన్నప్పుడు అసహ్యించుకున్న వాళ్ళే రూపంమారి
లోకం దృష్టిలో ఇప్పుడు బహు సుందరాంగుడవు
ఓ మన్మథ రూపుడా నీ అంతం అతిత్వరలోనే
కాని పూవులు ఫలదీకరణం చెంది
అందించే ఫలాలు బహుమధురం సుమీ,,,,,,,,,!!
ఓ సౌందర్య పిపాసకుడా నీవు సుఖించి సుఖపెట్టిన పూవులు
నీ గురించిన ధ్యాసే మరచిపోయే మాయావతులు
ఈ వన్నెచిన్నెల పూవులు బహు మోసకారులని మరువకు
జాగ్రత్త సుమీ ఓ సీతాకోకచిలుకా,,,,,,,,,!!

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *