సన్నజాజులు విరబూసిన నగు మోము
లలిత లలిత లావణ్య చంద్రలేఖవో
సన్నని తీగమళ్ళి లాంటి శరీరం కప్పివేసిన నాగమళ్ళివి
ఉదారంగు దుస్తులలో సౌందర్యం ఉట్టిపడే సంపంగివి
నిర్మల శోభిత మనోహర మనస్సు లాగే సొగసరివి
నీ చిరునగవులలో సిరిమళ్ళియల పళ్ళ వరసతో
నీ ప్రశాంత మోము మౌనగర్బితంగా
హృదయాలను లాగిపడేసే నిర్మలత్వంలో
శోభిళ్ళే సన్నని నవజీవనరాగం
ప్రియతముల హృదయాలను పిండివేసే
సహజత్వం నింపుకున్న ప్రియుల ప్రాణసఖివి
తల చుట్టూర ఆ శిరోజాలు అందానికి అందానివి
మృదువైన నునులేత పులకరింపజేసే సన్నాయిరాగంలా రూపం
ప్రకృతి ఒడిలో చేర్చుకున్న లేడిపిల్లలా
పారవశ్యం చెందు ఊదావన్నె ఉషస్సువు
చుట్టూ ఆకుపచ్చని వృక్షాల మద్య
మనస్సు తేలికయ్యేలా నయనాలు తీసే మృదు మధుర సమ్మోహన గీతాలు
పరుగులు తీసే సెలయేరులా పరువాల ముగ్ద సౌందర్యరాశివి మురళీరవాణివి,,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట