దివ్యాత్మజులు శ్రీరామకృష్ణులు

దివ్యాత్మజులు శ్రీరామకృష్ణులు

శ్రీరాముడు భరత ఖండంలో మానవ జీవితాలను మననీయకుండా క్రూరంగా హింసిస్తూ, కడుహేయంగా కల్లోలితం చేస్తున్న దుష్ట దుర్మార్గులను సంహరించాడు. ఆ మానవమాత్రుణ్ణి ఆ పరమశివుడే ఇంతకన్నా లోకకల్యాణం చేసే ఏ దేవతామూర్తి లేడని దైవంగా నారాయణమూర్తే నని శ్లాఘించాడు.
శ్రీకృష్ణుడు చిన్ననాటి నుండే బలపరాక్రములతో దుష్టులను శిక్షించాడు.రాధాలోలుడై, గోపీకల ప్రియుడై అష్టసతులతో సరస సల్లాపాలాడాడు.క్రూర దుర్మార్గులతో, పాలకులతో యుద్దాలు చేసి తలబింకం దించి హతమార్చాడు. శ్రీకృష్ణుడు జీవితంలో సుఖదుఃఖాలనన్నీటిని సమదృష్టితో శ్వీకరించాడు.అందుకే చివరికి కురుక్షేత్రంలో భగవద్గీత కురుపాండవులకు ముఖ్యంగా అర్జునునికి ప్రభోదించిన పరమాత్ముడు శ్రీకృష్ణుడు.
ఈ పరమాత్ములు జీవిత సంద్రంలో ఆటుపోట్ల సుడిగుండాలను సమదృష్టితో శ్వీకారిస్తూ చిరునవ్వుతో అతి సులువుగా ఈదుతూ ,మానవకళ్యాణమునకై పాటుపడ్డ దివ్యాత్మజులు.

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *