దున్నపోతు వెర్రి లోకం
ఈ చలి పులిలా గర్జిస్తుంటే గజగజ వణుకుతూ నీకు అగుపించని పిచ్చివాళ్ళు, బిచ్చగాళ్ళు, గరీబులు చలిలో శ్వాస ఆడక, జలుబు, దగ్గు, చలిజ్వరం అతలాకుతలం చేసినా ఎవ్వరూ పట్టించుకోక ,వీళ్ళను మనుషుల్లానే చూడని నైజం ఆటవిక మనుష్యులది. తాము ఉన్ని దుస్తుల్లో వెచ్చగా పొద్దెక్కిందాక నిదురించే వ్యవహార శైలి. అక్కడ ఎవడో పిచ్చివాడు బిచ్చగాడు చలికి, ఆకలికి తాళలేక అమ్మా అమ్మా అంటూ సూర్యోదయాన్నే అశువులు బాస్తే ,పారిశుధ్య కార్మికులు ఈడ్చుకుంటూ మున్సిపల్ వాహనంలో శవాన్ని ఊరవతల గోతిలోకి తోసేసిన విషయం ఎవ్వరికీ తెలియదు .ఇది మీడియా,ప్రభుత్వ విషయమే కాదు.సుర్రున కాలే చాయ్ తాగుతూ, తింటూ నీకు నీవే నీ బ్రతుకు గాడిద చాకిరీలో ఒక్కసారైనా అభాగ్యులకు ఏ సహాయం అందించక వీళ్ళూ నీలా మనుష్యులే నన్న ఇంగితజ్ఞానం లేని వెర్రివానివి. తూ,,, మనిషి పుట్టుకానీది మురిక్కాలువల వెంట తిరిగే పంది నయం,,,,,,,,
అపరాజిత్