అక్షరలిపి అంశం
ప్రేమ లేఖల పోటీ
శీర్షిక
నలుడు దమయంతికి వ్రాసిన లేఖ
ప్రియమైన దమయంతి దేవీ,
నీ సౌందర్యం మాత్రమే కాదు, నీ పవిత్ర ప్రేమ నా మనసుకు నచ్చింది. నిన్ను చూడక ముందే నీ గురించి నాకు తెలిసినా, నిన్ను చూశాక నీపై ప్రేమ మరింత
పెరిగింది.
రాజ్య సుఖాలు, వైభవాలు అన్నీ నాకు నీ ప్రేమ ముందు తక్కువే అనిపించాయి.
ప్రతి క్షణం నీ రూపమే నా కళ్ల ముందు నిలుస్తోంది. నీ
ప్రేమ వచనాలు నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. నా జీవిత యాత్రలో నీవే నా దిక్సూచి, నువ్వే నా అనురాగ దేవతవు. నీ ప్రేమను పొందాలనే తపన నా హృదయంలో ఉంది
దమయంతి, విధి ఎంత కఠినంగా పరీక్షించినా,
కాలం ఎంత దూరం వేసినా, నా ప్రేమ మాత్రం నిన్ను విడిచిపెట్టదు. నా శ్వాస ఉన్నంతకాలం నీ పేరు నా హృదయంపై చెక్కబడినట్లే ఉంటుంది. నీవు నా జీవితంలోకి వరమై వచ్చావు. నువ్వు నాకు తోడుగా ఉంటే ఈ ప్రపంచాన్నే జయిస్తాను
ఓ నా అనురాగ దేవతా.
నీ ప్రేమ కోసం ఎదురుచూస్తూ,
నీ నలుడు
ఈ రచన నా స్వీయ రచన
వెంకట భాను ప్రసాద్ చలసాని