నవయవ్వనం సౌందర్యం పొంగు

నవయవ్వనం సౌందర్యం పొంగు,,,,,,!!

కౌమారదశ వీడి యవ్వనంలోకి అడుగిడుతూ
తెలిసీ తెలియని వయస్సులొనే
కాలుజారి కమ్మని కలలు పండించుకుంటున్నట్లు భ్రమసి,,,,,,,,,
ప్రేమ ఊసుల పావురాలని పొగడ్తల అగడ్తలు తెలిసిన లోకం నిండా,,,,,,,,
చదువుకోండిరా అని తల్లిదండ్రులు పట్నం పంపిస్తే గుండెకోత మిగులుస్తారని ఊహించలేదు,,,,,,,,,
అతి చిన్నవయస్సులో విడదీయరాని ప్రేమ బంధంలో చిక్కుకున్న ఆకర్షణీయమైన వస్త్రధారణ మేకప్పులు,,,,,,,,
సినిమాలు శికార్లే జీవితమనుకుని
ప్రేమ నయనాలు పలికే ఇరువురి తొలిపొద్దు అందాలు
ఆకర్షణీయమైన నవయవ్వనం పొంగులో
ఏం చేస్తున్నారో తెలియని స్థితి
ఒకరినొకరు విడదీయరాని ఆకర్షణలో తీపి కబుర్లకు చేదు వాస్తవం తెలిసొచ్చి,,,,,,,,
ఇరువురి సాన్నిహిత్యం గుర్తుచేస్తూ కాలం తనపనిగా అమ్మాయి గర్భందాల్చి
ఇరు గులాబీలు వినీల ఆకాశం కింద కాలం చేతిలో చిరుప్రాయులు పావులు,,,,,,,
ఇంటర్మీడియట్ చదువులు గంగపాలు చేసుకున్న వైనం,,,,,,,,
తల్లిదండ్రులు చదువుకొమ్మని పట్నం పంపించి ఇష్టమొచ్చినట్లు డబ్బులు పంపిస్తుంటే విచ్చలవిడి తిరుగుళ్ళు,,,,,,,
గుండెలదిరిపోయే సాదృశ్యం చవిచూసి ఏం చేయాలో పాలుపోని దుస్థితి,,,,,,
ఇంటర్ చదువులకు ఉద్యోగం ఎవ్వరూ ఇవ్వరుగాక ఇవ్వరు,,,,,,
ఇద్దరూ గుబులు అగ్నిశ్వాసల్లో గుండెల్లో రైళ్లు పరుగెడుతూ,,,,,,,,
తొలియవ్వనం సినిమా కళ్ళల్లో తేలియాడుతూ సముద్రపు ఇసుకలో ఇరువురు రక్తాక్షరాలు లిఖించి,,,,,,,,,
నీలినీడల ఆకాశం కింద నీలినీలి సముద్రంలో అమ్మా అమ్మా అంటూ అలల్లో కొట్టుకుపోతూ గల్లంతైన పసిప్రాయుల అమరప్రేమ,,,,,,,,,,
ఇప్పుడిప్పుడే వికసిస్తున్న మల్లియలు రూపుమార్చుకుని ఎర్రమల్లెలై విరబూస్తున్నాయి,,,,,,,,,
ఈ పెద్దలు కని భూమిమీద పడేసి పిల్లలను పట్టించుకోకుండా వదిలేసిన దాష్టికం ,అప్పుడప్పుడు పిల్లలెలా ఉన్నారో గమనిస్తే పరిస్థితి వేరేతీరుగా వుండేది,,,,,,,,,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *