అక్షర సమూహం
అంశం : నేటి పిల్లల ప్రవర్తన—-సామాజిక బాధ్యత
శీర్షిక ;నవీన యువతరం,,,,,!
రచయిత అపరాజిత్ రెడ్డి
రోజులు మారాయ్
యువతీయువకులు తేడా లేకుండా
జీన్ ప్యాంట్లు పలుచని టి షర్టులను ధరించి చెట్టాపట్టాలేసుకుని కళాశాలలకు వెళ్ళే నవతరం,,,,,,
పబ్బులు హోటళ్లలో బార్లలో కలిసి తిరుగుతూ యవ్వనంలో ఉడుకు రక్తంలో వెలుగు జిలుగుల సైయ్యాటంలో వింత వింతగా కొత్తపోకడలు పోయే నాగరికులం అనే యువతరం,,,,,,,
జీవన పోకడలు చాలా సులభతరమయ్యాయ్
ప్రభుత్వ ఉద్యోగాలకై ఎదురుచూడక రకరకాల సంస్థల్లో కంపినీలలో ఏ సీ ల కింద తెల్లవార్లు షిఫ్టులుగా శ్రమలను సులభతరం చేసుకుని ఉద్యోగాలు చేస్తున్నారు ఆడమగ తేడా లేకుండా,,,,,,,,
వీళ్ళవి తాత్కాలిక స్నేహాలు ప్రేమలు పెళ్లిల్లతో సహా విశృంఖల జీవన విధానం,,,,,,,
సాంకేతిక పరిజ్ఞానం పుష్కలంగా ఉన్న మేధస్సుతో నిరంతరం కంప్యూటర్ లతోనే పనులేవైనా ప్రాశ్చాత్య నాగరికత పునికిపుచ్చుకున్న యువత ,,,,,,,,
ఉద్యోగమైనా వ్యాపారమైనా ఇంటినుంచే అన్నీ,,,,,,,
మనం ఈ నూతన పోకడలను స్వాగతించక మానవత్వం అంటూ గగ్గోలు పెడితే వినేవారేరి,,,,,!
ఈ పోకడలు పట్టణాల నుండి పల్లెలకు నెమ్మది నెమ్మదిగా పాకుతోంది,,,,,,
జీవన విలువలు కాగితపు పూవులయ్యాయ్ అనుబంధాలు ఆప్యాయతలన్నీ గాలి కబుర్లయ్యాయి,,,,,,,,
మనం ఈ నిజం నిప్పులను మింగక తప్పని పరిస్థితి ,,,,,,,,,
యువతరమా నీ పయనం ఎటు !?!
ఏమిటి ఈ జీవన విధానం!?!
ఎటువైపు పోతోంది ఈ నవీన సమాజం!?!
అసలు సమాజమంటూ ఉందా!?!
ముళ్లే పూవులనుకుని ముద్దుపెట్టుకునే నవీకరణలను ఏమందాం చెప్పండి!!?!
అపరాజిత్
సూర్యాపేట
హామీపత్రం : ఈ రచన నా కలం సేతయని నా హామీ