నవోదయం సూరీడా నీకిదే వందనం,,,,,!

శతకోటి భాష్యాల రాగాలతో
సుకుమార అరుణారుణ కిరణాలలో నవోదయం
మందారం వన్నె పులుముకున్న తూరుపు ఆకాశం మగువ
తెల్లని బొట్టు పెట్టుకుని సున్నిత సువర్ణ కాంతులు చిమ్మే తెల్లవారుజాము రాగాలలో,,,,,,
పొట్టకొచ్చిన వరిచేను కంకులన్నీ తలలూపుతూ
తూరుపు తెల్లబంతి పూవుకు స్వాగతిస్తున్నాయి
నింగినేల ఒక్కటై ప్రకృతి ఆనందతాండవం చేస్తోంది,,,,
ప్రశాంత వెలుగుల జల్లులలో సృష్టి సృజన కారకుడా రా తరలిరమ్మూ
ఈ అవనిపై జీవం కారకుడా నెమ్మది నెమ్మదిగా నీ తీక్షణ వాడివేడి కిరణాలతో
ఈ అవని అల్లల్లాడుతూ దీనంగా మోకారిల్లి పాదాభివందనం చేస్తూ వేడుకుంటోంది కాపాడమని,,,,,,
నా అవనిపై కోటానుకోట్ల జీవాలు నీ బిడ్డలేనయ్యా ఎండల మంటలతో చెలరేగిపోకయ్యా,,,,,,
జీవం రాకడకు పోకడకు మూలమైనవాడా శతకోటి వందనాలు నీకు,,,,,
అగ్గిరగిలే తీక్షణ కిరణాల ధాటితో ఈ మానవులను వేపుకు తినకు భగవానుడా,,,,,
మొన్నటి దాకా వానలతో చలిగాలులతో వరుణుడు తన ప్రతాపాన్ని చూపి వెళ్ళిపోయాడు,,,,
ఈ అవనిపై అడవులన్నీ అంతరించిపోవడానికి కారణం మానవుడే మోడుపడిన బీడుచేశాడు,,,,,,
నిలువ నీడలేని కార్చిచ్చుల వాడికిరణాలతో కక్షతీర్చుకుంటానంట్లే ఎట్లాగయ్యా,,,,,
మనిషన్న వాడికి జ్ఞానోదయం కలగాలంటే నిరుపేదల ఆకలి కేకలను కూడా పట్టించుకోవాలయ్యా,,,,,
అగ్ని కెరటాలతో విలయతాండవం చేస్తూ కలియుగానికి ఇప్పటికిప్పుడు అంతంపలుకకయ్యా ఆదికేశవుడా సృష్టి స్థితి లయకారకూడా శాంతించవయ్యా కరుణామయా,,,,,,
ఈ జనజీవనయాత్ర ఇంకొన్నాళ్ళు కొనసాగనిమ్ము ఓ సూర్యభగవానుడా సుందర శ్యాముడా సహణశీలి,,,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *