నాట్యం కళల హృదయజ్యోతి,,,,,!!
కళ కోసం కళ కాదు
కళ ప్రజల కళ్ళ జీవనాడి
కళా పిపాసకుల హృదయ నేత్రం నాట్యం
ఒక నాట్యకళ సృజనా బీజం మొలకెత్తి మాహావృక్షమై విస్తరించడానికి భాగస్తులైన కృషీవళురెందరో,,,,,,,,
సంగీతానికి అనుగుణంగా లయబద్దంగా పదవిన్యాసంతో ఒంపుసొంపుల వయ్యారంతో శరీరంలోని అనువణువు నాట్య రీతిలో భాగమై హృద్యంగా ప్రేక్షకులకు మనోల్లాసమిచ్చేది భరతనాట్యమైనా కూచిపూడియైనా అది నాట్యం హృదయాంజలి,,,,, ,,,,,,,,
మాహాసముద్రమంత లోతైన భావాలను నాట్యంలో హావభావాలలో శరీరంలో అణువణువూ కళ్ళయి జీవనజ్యోతుల సాక్షాత్కారమై జ్వలించేదే నాట్యకళ,,,,,,,,,,
కాళాకారుల హృదయ అంతర్భాగంలోని రసమయ ఆనంద కడలి ఉప్పొంగి తేజరిల్లే పౌర్ణమి పూసిన వెన్నెల వసంతం ముఖారవిందం ,,,,,,,,,,,,
పదముల మువ్వల రవళుల మోహన మురళీ రాగాల ఢమరుక ద్వనుల నాట్యవిలాసం ఉప్పొంగే సభాసదుల కరతాల ధ్వనుల్లో నాట్యం పరమ సుఖం పవిత్రం వివశులవుదురు ప్రేక్షకులు అభిమానులు,,,,,,,,,
శాస్త్రీయ నాట్యరీతులు ఎన్నెన్నో ఉద్బవించిన భారతదేశం నేటి వికృత ప్రాశ్చాత్య నాట్యరీతుల మోజులో దేశీయ నృత్యాలు కనుమరుగు కాకుండా విద్యాలయాల్లో అంశాలుగా శాస్త్రీయ నృత్యాలను ప్రవేశపెట్టాలి,,,,, ,,,,,,
అపరాజిత్