నా కలల రాకుమారికై

అక్షరలిపి
అంశం: ప్రేమ లేఖల పోటీ కోసం…
శీర్షిక: నా కలల రాకుమారికై

ప్రియాతి ప్రియమైన ప్రేయసికి రాస్తున్న ప్రేమ లేఖ…

మౌనమేళనోయి నా మదిలోని రాగాలు పలికించాగా రావోయి…
కలువ కన్నుల కవ్వింపులతో నా హృదయ వీణను మీటగా రావోయి…
పెదవంచున దాగున్న నీ తేనె పలుకులతో నన్ను పలకరించగా రావోయి…
సాగర తీరాన్ని చేరేందుకు ఆరాటపడే అలల నురగవై నన్ను చేరగా రావోయి…
శశి కాంతుని వెన్నెలకై వేచి చూసే చకోర పక్షివై  కౌగిలిలో ఒదిగిపోగా రావోయి…
చినుకమ్మకై ఎదురు చూసే నెమలమ్మల నాట్యనివై రావోయి…
నా ఆశల హరివిల్లులు కరిగిపోకుండా,కనుల బారం పెరిగిపోకుండా, కలలా చెదిరిపోకుండా నా జత చేరగా రావోయి నా కలల రాకుమారి…

             ఇట్లు                            
    నీ రాకకై ఎదురుచూసే…

అజ్ఞాతివాసియైన నీ ప్రేమికుడు…

హామీ పత్రం: ఇది నా స్వయం రచన…

మీ క్రాంతి సుధా✍️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *