నా తెలుగు భాషా
ఇది పదునారని గుండె ఘోషా…
పదాల మకరందమై తేనెలూరుతు
వెన్నేటి కథలతో ఆరగింపవుతు..!!
రాచరికపు వైభవాలతో ఘణకీర్తింపులై
దేశ భాషలకు లెస్సైన నా తెలుగు భాషా…
ఆదికవి నన్నయ్యతో మొదలుకొని
నేటి కవి సినారేను కలుపుకొని..!!
కావ్యమై శ్రావ్యమై లతలతో ప్రాకారమై
కవిరాజుల గుండెల్ని తలుపు తడుతు…
ఎందరో హృదయాలను గూడు గడుతు
నిక్కమై పెరిగిన నీరెండని నా మాతృభాషా
పాతరేసినా పరాయి భాషతో
వేదమున్న భాష వెర్రితలలతో దోషమై
పదారణాల ప్రాస పట్టు తప్పుతున్నది..!!
తెగిన సరాలు ముక్కలై రాలుతున్నవి…
కూయని రాగాల గొంతు మూగబోయి…
చెప్పకనే మాతృభాష మృతభాషై పోతున్నది
తొలికోడి కూతతో వేకువలమై
పురివిప్పి ఆడేటి నెమలికి నాట్యమై…
గలగలాపారేటి జలపాతాలతో గీతమై..!!
తోరణాన్ని కట్టినా వసంతాలతో శోభితమై
ఉగ్గుకథలతో తెలుగునాటకి ఆత్మగౌరవమై
తేట వెలుగుల మాతృభాషను చదుకోవాలి
(మాతృభాషా దినోత్సవ సందర్భంగా…)
దేరంగుల భైరవ (కర్నూలు)
9100688396