ఉదయ సంద్రం తీరందాటి ఉబికి వస్తున్న కెరటాల ఘోష
నా కన్నీళ్ళు అక్షరాలలో ఉప్పొంగే హృదయ సముద్రం పాడే గీతాలు,,,,,
హృదయం లోతుల్లో గెలికితే లక్షల అక్షరాలు నీకోసం ప్రళయ గీతాలు లిఖిస్తాయి,,,,,,,,
సముద్రమంతా అల్లకల్లోలం నా గుండె లయల ఢమరుకంలో,,,,,,,
దుఃఖిత కళ్ళల్లో ఊపిరులూదే శ్వాసాలు నా అక్షరాలు జీవం పోసుకుని రక్తం సిరాతో లిఖిస్తాయి,,,,,,,,,
నా హృదయ సముద్రం నిండా స్వప్నాల కెరటాలలో ఊగిసలాడే జాగృత కళా చిత్రాలే,,,,,,,,,,,
నా గళం పాడే విషాద గీతాలు హృదయ సంద్రం నిండా అక్షరాలలో పరుచుకున్నాయి,,,,,,,,,
నా మనస్సులో మెదిలే భావాలు గతితప్పిన జీవితాల గుండె కోతలను అక్షరీకరించలేని హృదయం ఘోషలు,,,,,,,,
సాగరమంత లోతైన అఘాదాలు నా ప్రాణాలను తోడేసే భావనలు నైరాశ్యంలో మగ్గిమగ్గి పెల్లుబికి వస్తూ అక్షరీకరించమని వేడుకుంటున్నాయి,,,,,,,,,,
ఈ జీవితం మీద మమకారం తగ్గని ఈ శరీరం నన్ను విడువకని నేను వ్రాసే అక్షరాలకు సంకెళ్ళు వేస్తూ ఆరోగ్యం కోసం కొన్ని వదులుకోక తప్పదని గుండె కోతలకు లేపనాలు పూస్తోంది,,,,,,,,,,
అక్షరాలే లక్షలని భావించే నాకు కుతకుతలాడే భావాల అగ్నిసంద్రం హృదయంలో కిక్కిరిసిన నిరపేదల అగ్నిశ్వాసలను జాగృత పరిచేందుకు లిఖించమంటోంది చైతన్య సచేతనా జీవం,,,,,,,,
ఈ మేడిపండు సమాజాన్ని సాలోచనగా గమనించి నా హృదయం ఊగి ఊగి ఉప్పెనై విరుచుకుపడి వేరుపురుగుల్ని ఏరేయమంటోంది,,,,,,,,,,
ఓ ఆకలికి అల్లల్లాడే నిరుపేద భుక్తికోసం విముక్తి కోసం పోరాటమే శరణ్యం ,నీ తలరాత నీవే లిఖించుకో నీ హృదయంలోని జమదగ్నిని రగిలించుకో, ఉవ్వెత్తున ఎగిసిపడు, నీకు నీవే నిప్పుకణిక ,నీకు నీవే తొడునీడ,,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట