నా కళ్ళ చమరింతలు
నీ హృదయంలో
గూడుకట్టుకున్న నిఘోడ
అలజడుల అవలోనలు !
నేను వ్రాసే దుఃఖిత మది గీతాలు
నీ మనస్సు సుదీర్ఘంగా వివర్ణమైన
సంక్లిష్ట క్లేశాల దుర్గతులకు ఔషధాలు !
నా హృదయం తీసే రాగాలు
నీ గుండె అపస్వరాల సవరింతలు
నీ మనోతటాకం సంవేదనలలో
సైతం పూసే తామరలు
నీ మనోవిశ్లేషణల కొరకు ఈ అక్షరాలు !
నా గళం పాడే విషాద గీతాలు
నీ మనోవ్యథల విముక్తి రాగాలు
నీ అపశ్రుతి ఆలోచనల క్రీనీడలు
స్వస్తి పలికి వెలిపోయే నిష్క్రమణలు
నా అక్షరాలు నీ మనోవైకల్యం శుశ్రూతలు !!
నీ మనస్సుకైన లోతైన గాయాలు
నా పలుకులు తేలికపరచు దుఃఖాలు
నీ వేదనల కన్నీళ్లు తోడేసే నా అక్షరాలు
నీ నిగూఢ స్వప్నాలు సూచిస్తూ
అమలుకై వేసే చలివేంద్రాలు
వదలిపోవు నీ మనోచాంచల్యం
ధ్యానంలో అధ్యయనంలో ప్రశాంతత అలవడు
ఆకలి సంవేదన దుర్గతుల పాల్జేయును
నీకున్న జ్ఞానమే మార్గదర్షి
ధనసంపాదనకై పడే శ్రమలు
నీ మనస్సుకైన గాయాలు బహుస్వల్పం సుమీ !
నీ నరకతుల్య ఆలోచనల క్లేశాలు
విడిపోతూ శ్రమల సౌందర్యం కొరకు
చేతులు చాచి ఆహ్వానం పలికే
చైతన్య శ్రవంతులు నీ మనోరగాలు
ఆలకించి పదవోయ్ నీవు
ఉదయించే దారిలో ఉద్యమంలా!!
నీవు నిరూపయోగం చేసుకున్న క్షణాలు ఇకరావు
అవి నీ సోమరితనం కోసం
శరీరమంతా తూట్లు పొడుచుకున్న సౌకర్యాలు
ఆరోగ్యం ఆనందం అమరు శ్రమయేదైనా
ఈ విజ్ఞాన విపంచి దారిచూపు
అజ్ఞలను అమలు చెయ్ కుశాగ్రబుద్దితో
విడువక ఒడలు వంచి శ్రమచేయి శునిషితంగా,,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట