నీ అక్షరాలు నీ గుండెల్లో బాకులు,,,,!!
ఈ పయనం ఎందాకో
గుండె చెలిమెలో రక్తం ఊట తగ్గుతోంది
మనస్సు తీవ్రమైన అలజడికి నాడులను తెగ్గొడుతున్న సురకత్తుల ఆలోచనలు,,,,,,,,
మనస్సు నిండా గబ్బిలాలు రొదపెడుతున్నాయి
నీ తలంపులన్నీ కురిసే మంచులో అంతర్థానమయ్యాయి
ఇంక దేనికోసం ఈ అక్షరాలు అగచాట్లు ఆనందాలు చంపుకుని,,,,,,,
ఓ సారి వెనక్కి చూడు నిన్ను నిలువునా పాతారేసేందుకు వేల కళ్ళతో ప్రేమలు కురిపిస్తున్నారు,,,,,,,,
నీవెంత ఉక్కిరిబిక్కిరియై సంబరపడుతున్నావో దాని వెనక ఎన్నెన్ని కారుచీకట్లో నీకే తెలుసు,,,,,,
దోసిలిపట్టి అర్ధించినా నీ దాహం ఈ లోకంలో ఎవరూ తీర్చలేరు ,ఆ వేడుకచేసే వసంతాలిక రావు వృధా ప్రయాస,,,,,
కాల చక్రం గిర్రున తిరుగుతోంది నీ వెర్రి పరుగులిక ఆపు,,,,,
నీవు నీవుగా అగుపించని అంధకారంలో
కొట్టుమిట్టాడుతున్నా ఆవలి ఆనంతంలో ఏదో నీ దృగ్గోచర చిత్రీకరణ జరుగుతోంది,,,,,,
నీవు రోజు రోజుకు ఎంత మారుతున్నా ఇది స్థబ్దు ప్రపంచం డబ్బుల లెక్కలే కావాలి,,,,,,,
చదువులు రాతలతో తలరాతలు మారుద్దామన్నది వృధా ప్రయాస,,,,,
నీ దారిలో ఎన్నెన్ని గాయాలు ,వ్రణాలైనా పట్టించుకోని లోకానికి నీ విజ్ఞానం పూచికపుల్లతో సమానం,,,,
సమస్త లోకం కళ్ళ కనుపాపలలో రూపాయల కట్టలు అగుపిస్తున్నాయి కీకారణ్యాల్లా,,,,,,,
నీ అక్షరాల వెల్లువలు అక్కర్లేదు ,చదువులు సంస్కారం మంటగలిశాయి ,నీ కలం సినిమా ఖడ్గం చిన్నపిల్లల ఆటబొమ్మ,,,,,,,,
అందుకే సోదరా డబ్బుకు లోకం దాసోహం,,,,,,
ఈ లోకంలో నీకై నీవే కొరడాతో కొట్టుకున్నా నిన్ను పట్టించుకోరు ,నీవేమైనా డాబుసరి డబ్బున్నవాడివా,,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట