నీ ఆగమనంలో విరిసిన మోము

నీ ఆగమనంలో విరిసిన మోము

పూవుల వసంతాల మనస్సు
తన విదేశీయానం ముగింపు
తన రాకడకై దిగులు కళ్ళ నిరీక్షణ
తను లేని దినాలు ముళ్ళ లోగిళ్ళు
అనురాగం ప్రేమ కోల్పోయిన హృదయం
తనువు మనస్సు తనకై తపన
తన సుదూరాలు హృదయం కోసిన వేదన
ఆగిఆగి కురిసే గాలివాన హృదయంలో
తన ఉద్యోగ ధర్మం ఓ గులాబీ ముళ్ళు
తనకై అక్షరీకరించలేని ఎదురుతెన్నులు
తన ఊపిరిబాసల కోసం సంవేదన
కెరటాలు కెరటాలుగా ఆలోచనల అలజడి
ఈ రేయి మూసుకున్న తలపులు తెరుచుకుని
అక్షరాలను ఒడిసిపట్టి ఆనందం పిండినట్లు
ఈ రేయి వెలుగు దీపం తన రాకడకై
గతించిన రోజులలో రోజాలు పుష్పిస్తూ
నింగిలో నక్షత్రాలను లెక్కిస్తున్నాయి
నా మోము వాడిపోయిన మరుమల్లియ
నీవు ఏతెంచిన అలికిడిలో
నా కళ్ళల్లో గుబులు సంగీతాలు
నీ ఆలింగనంలో కారుమబ్బులు విడిపోతూ
నీ ప్రయాణం బడలిక తీరేందుకు
ఆనంద భాష్పాల వేన్నీళ్ళు స్నానానికై
ప్రియా నీ రాకడ కమ్మని తేనీయలు,,,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *