నువ్వునేనూ

నువ్వు
నేనూ
అతనూ
అక్షరాలమే….!
నువ్వు నువ్వుగానే ఉంటే
ఒంటరి అక్షరాని.. వే…!
నువ్వు శ్రోతవై
వాళ్ల ఉవాచలు వింటూ
అక్షరాల్ని పోగేసుకుంటూ పోతే
నువ్వు పదం అవుతావు….!
వాక్యము అవుతావు….!
రసాత్మకమైన కావ్యము అవుతావు…..!
నువ్వు శ్రోత వయితే…….!!
పెడసరి వయితే ఒంటరి అక్షరంగా…….
మిగిలిపోతావు……!!!
🩷
🩷 ఆచార్య పాయసం సుబ్రహ్మణ్య మహర్షి
9490125878
13_12_25

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *