నువ్వు #నేను

నువ్వు #నేను
హాల్ లో ఫోన్ రింగ్ అవుతుంది…..
అప్పటికే మూడవసారి….
అవతల గట్టిగా అరుస్తూ అమ్మ …అంజలీ.. పోన్ తీయవే….
పోన్ లో అవతల, నేను విజయవాడ వచ్చాను. అంజలీ ఆత్రంతో తను కలిసిందా… లేదు.. ఇంకా చెప్తూ ఉండగానే ఫోన్ పెట్టేసింది.
పక్కనే సముద్రం హోరెత్తి పిలుస్తున్నట్టుగా అలవోకగా కాళ్ళు అటువైపు కదిలాయి. ఒడ్డున కూర్చుని కాళ్ళను తడిచేసి తిరిగి వెళుతున్న అలల వలె అంజలి గత జ్ఞాపకాల్లోకి తొంగి చూసింది…
అంజలీ.. అంజలీ ..ఏమిటో అమ్మ వాళ్ళు లేరుగా. ఊరు వెళ్లారు. నీకోసం ఎవరో వచ్చారు చూడు ఎవరు…
ఎదురుగా తెల్ల రంగు కుర్తా మీద బులుగు పువ్వులు, విశాలమైన నదురు, రింగుల జుట్టు, మెటల్ గాజులు చేతులకి ,సామన ఛాయ ముఖం దుద్దులుకున్న తెల్లని రాయి మెరుస్తూ భలే ఉంది…
ఎవరు అని అడిగే లోపల ఎంతో తెలిసిన ఆమెకు లాగా ఏంటి అంజలి బాగున్నావా? బాగా చదువుతున్నావా అని అడిగేసింది.
ఫోన్లో గొంతు వినటం వల్ల గుర్తుపట్టడానికి ఎంతో సమయం పట్టలేదు .బీచ్ కి వెళ్దామా సరే ముగ్గురు బీచ్ లో తింటూ, తిరుగుతూ మాటలు కలిపారు జ్యోత్న్స అన్న ఎలా పరిచయం అయ్యాడు కంప్యూటర్ నేర్చుకోవడానికి వచ్చాడు.పరిచయం అవడానికి ఎంతో సమయం పట్టలేదు అంజలి పెళ్లికి మీ ఇంట్లో ఒప్పుకుంటారా.. ఒప్పుకుంటారు అమ్మానాన్న ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఏగా .మరి మీ ఇంట్లో పూర్తిగా చర్చికి వెళ్తారు ఒప్పుకుంటారా. కష్టమే ,ఒప్పించడం . జ్యోత్స్న సాయంత్రం తిరిగి విజయవాడ బయలుదేరింది. అప్పటినుంచి రాకపోకలు కొంతకాలం సాగాయి జీవితం ఎంతో ఆనందంగా హాయిగా ఉంది.
జ్యోత్స్న కి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు .నేను వెళ్లి మాట్లాడాను. ఇప్పుడే జాబ్ వచ్చింది ఇంకో టు ఇయర్స్ లో చెల్లి పెళ్లి చేసి, పెళ్లి చేసుకుంటానని చెప్పాను. అయినా వాళ్ళు ఒప్పుకోవటం లేదు. ఎందుకన్నా నా పెళ్ళికి తొందర ఏముంది .ముందు నువ్వు చేసుకో అలా అయినా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవటం లేదు. రమ్మంటే జ్యోత్స్న, నా పేరెంట్స్ని వదిలి రానంది. ఇద్దరికీ గొడవ అయ్యి అన్న నెల్లూరు వెళ్ళిపోయాడు అన్న అన్ని సర్దుకుంటాయకున్నాడు. రోజు ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాడు .కానీ జోత్స్నా తీయడం లేదు.
ఎనిమిది నెలల తర్వాత జ్యోత్స్న కలవడానికి విజయవాడ వెళ్లాడు .అది చెప్పటానికి అంజలికి ఫోన్ చేశాడు .అంజలి జ్యోత్స్నకి 6 నెలల క్రితమే పెళ్లయింది. తను ఎంత చెప్పినా పేరెంట్స్ వినలేదంట .ఆ బంధంలో తను ఇమడ లేక ఇటు నాతో చెప్పలేక మూడు నెలలు క్రితం ఉరివేసుకొని చనిపోయింది. ఎంత నరకం అనుభవించి ఉంటుందో .అని గొంతు పగిలేలా అరిచి ఏడుస్తున్నాడు. ఆ ఏడుపులు వింటూ సముద్రం అంచుకు చేరిన అంజలి కాళ్లను తడి చేస్తున్న అలలుకు మరల తేరుకుంది.
చేసేది ఏమీ లేదు .ఎంత ప్రేమ ఉన్నా ఇద్దరు ఒకటి కాలేకపోయారు. అన్న రెండు, మూడు సంవత్సరాలు జోత్స్న జ్ఞాపకాల నుంచి బయటపడలేకపోయాడు.
తనను మర్చిపోవడం కోసం పనిలో
నిగ్నమయ్యాడు…
అంజలి తన పెళ్లి అడ్డంకు లేకుంటే అన్న చేసుకుని వాడేమో , జ్యోత్స్న లైఫ్ లో ఇలా అయ్యేది కాదేమో, అందరూ కలిసి వాళ్ళ పేరెంట్స్ ని ఒప్పించాల్సిందేమో అనే ఆలోచనతో సాగిపోతూ ఉంది.. ఎప్పుడు బీచ్కు వచ్చిన జ్యోత్స్నా జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి.
కొన్ని ప్రేమలు విఫలంమవ్వటానికి ప్రేమికులే కారణం కాకపోవచ్చు ,చుట్టూ ఉండే బంధాలు, అనుబంధాలు ప్రధానంగా ప్రభావం చూపిస్తాయి.
ప్రేమ ,విరహం , విఫలం ఏదైనా జీవితంలో భాగం మాత్రమే జీవితం మాత్రం కాదు….
జీవితంలో ముందుకు సాగిన అన్నకి నాకు ఏదో ఒక మూల తన జ్ఞాపకాలు పదిలంగానే ఉన్నాయి…

-రచన: జనని

ఈ రచన నా సొంతమే అని హామీ ఇస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *