నేటి తరం పిల్లలు

అక్షర కొరకు
నేటి పిల్లల ప్రవర్తన సామాజిక బాధ్యత
రచన – ఉమాదేవి ఎర్రం

శీర్షిక – నేటి తరం పిల్లలు

నేటి తరం పిల్లలు
గూటి లోని గువ్వలు
ప్రపంచ మెరుగని బాలలు
అమాయకపు దివ్వెలు!

ఇంటి లోనే ఆటలు
బడి లోనే చదువులు
ఫోన్ ఉంటే చాలు
ప్రపంచమే వేరు!

తల్లి తండ్రుల గారాల పట్టీలు
ముద్దు ముద్దు మాటల గులాబీలు
చిరు చిరు నవ్వుల మందారాలు
కల్మషమెరుగని కనకాంబరాలు!

ఈనాటి పిల్లలు
స్వఛ్చమైన మల్లెలు
రంగు రంగుల పువ్వులు
అందమైన నవ్వులు!

నెట్టే జీవితమని
ఫోనే సర్వస్వమ
ఆటలంటే అవేనని
పాటలంటే అంతేనని
తలపోచే బాలలు!

ఇది నా స్వంత రచన అని హామీ ఇస్తున్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *