నేటి మహిళ!

ఓ మహిళా
తెలుగు వాకిల్లలో కళ్లాపి జల్లి
ముగ్గులు పెడుతూ తూరుపు తెలవారగా
ఈ నిలువు దోపిడీ సమాజంలో,,,,,,,!
వరి నాట్లల్లో,,,,,కుప్పనూర్పిళ్లలో
పత్తి చేలల్లో,,,,,,మిరప తోటల్లో
పంట ఏదైనా నీవై!
మగవాళ్ళతో సమానంగా దినసరి కూలీవై
పనికి సమాన కూలీ పైకం పొందలేక
కురిసే బ్రతుకు జడివానలో ముద్దై!
ఇక బస్తీల్లో కాలేజీ చదువుల్లో సరస్వతివై
అబ్బాయిల కంటే గొప్పగా చదివి
ఇంజనీరింగ్,మెడిసిన్,సైన్స్,ఆర్ట్స్
ఇది అది అనకుండా అన్ని రంగాలలో మేటివై!
గవర్నమెంటు ఉద్యోగాల్లేక
ప్రయివేటు టీచర్,,,,,,ప్రయివేటు లెక్చరర్
సాఫ్టువేరు ఇంజనీర్,,,,,,మెడికల్ ప్రాక్టీషనర్
ప్రయివేటు అన్నిరంగాలలో,,,,,,,,,,,,,!
ఆడవాళ్లని చూడకుండా
వెట్టిచాకిరీ చేయించుకునే యాజమన్యం
నీ నిస్వార్థ సేవకు అందేది తృణమో ఫణమో!
మాయలోళ్ల సినిమాల్లో,టీవీల్లో
నిన్ను అసభ్యంగా చూపించే నైజం!
వెర్రి మొర్రి కుర్రకారు
నిన్ను అవమానించి అభాసుపాలు చేస్తే!!?
సహనంలో అవణిని మించిన అవణివి!
క్రీడల్లో మేటివై
దేశ పతాకాన్ని వినువీధిలో ఎగరేశావ్!
నాటి భారత కోకిల సరోజినీనాయుడు
నిన్న మొన్నటి ప్రధాని ఇందిరా ప్రియదర్శిని
వినీల ఆకాశంలో సేదతీరిన కల్పనా చావ్లా
భారతరత్న సంగీత చూడామణీ ఎం ఎస్ సుబ్బలక్ష్మి
మహిళా,,,,,,,,భరతమాత సిగాలో
ఎన్నెన్ని కీర్తి పతాకాలో గదా!!
మహిళా,,,,,నీ హృదయ వేణువుకు ఎన్ని గాయాలో గదా
మహిళా,,,,,ధరిత్రి నిండా నీవే!
ఆ వినీల గగనంలో చూడచక్కని చందమామ
కురిపించే చల్లని వెన్నెలను
దోసిట్లో పట్టలేము సుమా!!

ఆపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *