కాలం రథచక్రాలు వడివడిగా పరుగిడుతున్నాయి
జీవితం అస్తిత్వం కోల్పోతూ నేను అనేవాడిని,,,,
అంకుశమై గుండెల్లో గుచ్చుకుంటోంది అనారోగ్యం,,,,,,
అభాసుపాలవుతున్న అక్షరం పట్టుకుని వేలాడుతూ నేను
కారుచీట్ల కెరటాలలో కొట్టుకుపోతూ నేను అనేవాడిని
పుట్టినప్పుడు తల్లి రంగరించి పోసిన ఉగ్గుపాలు
ఎంత బలవర్ధకమైనవో నా అస్తిత్వం ఇంకా మిగిలింది
పసిడి వన్నెల రామచిలుకల్లా మనోఫలకం ఆలోచనలు ఇంకా గగనం నిండా విహరిస్తున్నాయి,,,,,,
ఒకవైపు జీవం కోల్పోతున్న లబ్ డబ్ ల హృదయం వేగం తగ్గింది
వెల్లువలా దూసుకొస్తున్న ఆలోచనల విషాదం ఓదార్పుగా అక్షరాలలో లిఖిస్తున్నాను
అంధకారంలో ఆషాకిరణాలు మిణుగురుపురుగులు నా చూట్టూర నర్తిస్తున్నాయి మేమున్నాం నీకోసమని,,,,,
వెకిలి మనుష్యుల వెటకారం విశం మింగుతూ ఇంకెన్నాళ్ళో ఈ బ్రతుకు,,,,,,,,
లక్షల నక్షత్రాలు నాకోసం చమక్కుమన్నా నా మనస్సు నాది కాకపోతే చేసేదేంలేదు,,,,,
మనస్సు నిగూఢంగా వున్న పొరలు విప్పుకుని ఆలోచనలు వేధించినవి అక్షరీకరిస్తే దుఃఖిత మది కళాఖండ మవుతుంది,,,,,,
కృషీవలుడు పండించిన పంట వరదల పాలై రోదించినట్లు
చదివిన చదువులకు ప్రయోజనం లేక ఇరానీ చాయ్ లో గొంతులు తడుపుకుంటూ పస్తులలో నగుబాట్లు వెక్కిరిస్తుంటే నేను నేనుకాను ఎడారి ఓడను,,,,,,
శతకోటి నీటిబిందువులు కలిస్తే కెరటాలు విప్పుకున్న కన్నీళ్ళ సముద్రం సునామీయై తోసుకొస్తే నేను మిగలకున్నా అక్షరం అస్తిత్వం కోల్పోదు,,,,,,
ఇన్నిన్ని యాతనల్లో అక్షరంకై ఖండఖండాలయి లిఖిస్తే ఏమిటీ వెర్రిరాతలు అని గిరాటేసే లోకంలో జీవితం అర్థం కోల్పోయింది,,,,,
ఎన్నెన్నో పూవులు వికసిస్తాయి ఏవో కొన్ని గుడిలోనో తలలోనో పెట్టుకుంటాం, అంతమాత్రాన మిగతా పూవులు అందాన్ని ఆనందాన్ని హృదయాల్లో గుభాళించట్లేదా పూవుల ప్రేమికులలో ?,,,,,,,,,,
ఎవరి జీవితం విలువైనా విలువల వ్యక్తిత్వం రూపుదిద్దుకునేది అక్షరంతోనే,,,,,
అపరాజిత్
సూర్యాపేట