పక్వమైన సౌందర్య ప్రేమాయణం
పూసిన పౌర్ణమి సింధూరం
యువతి సుకుమార సౌందర్యం
వెన్నెల రేయి బిగుతైన వస్త్రాలలో
ప్రియుని హృదయంలో గుంభనంగా దాగివున్న
వలపుల కాంక్ష మనస్సు లోతుల్లోని మన్మధున్ని
సరిజోడు సయ్యాటకు పిలుపుల రంగుల రవళి
మధువొలికే మృదుమధురం కాషాయ కమలం రూపసి
సన్నజాజుల వసంతం సుందరి రూపం
ప్రియుని కౌగిలిలో కరిగిపోయే మరులుగొన్న గోపిక
సిరులు పూసిన ఎక్కుపెట్టిన మన్మధ బాణం
హృదయం లోతుల్లో దాగివున్న రసాస్వాదన రగిలించే ఈ రేయి
పూవుల పుష్పార్చన పురుషునికి
గుండెలు పిండి యవ్వనం పిండిచేసే కామిని
అద్భుత సుఖాలందజేసే చంద్రలేఖ తనువు
కాంక్షల సముద్రంలో ఈదులాటలకు ఆహ్వానించే
సన్నాయి రాగాల సరోజిని
మనస్సులో రగులుతున్న మృణాళినీ ముసలం
కవికి కనబడే గాఢ గంధర్వంలో
లిఖియించే రంగుపూవుల రాధిక
మొగలిపూవుల సుగంధాలు కనుల కౌగిలింతలు
తనువు గోదావరి గలగలల సింధూర పూవు
మనస్సు నిండా వర్షపు జల్లుల వసంత రాత్రి జ్ఞాపకాలు
కామలోహితం కనుల కాంక్షాస్వప్నాలు
ఊగిసలాడే కోరికలను ఉర్రూతలూగించు
చెలియ కరములలో దాగివున్న కోర్కెల గని
కెరటాలు కెరటాలుగా వచ్చే కోర్కెల సముద్రాలు మనోఫలకం
ఆలోచనలలో అలజడి రేపే సుకుమారి సౌందర్యం సాగర సమీరంలో
పండిత పామరుల పట్టుపానుపు సందిలి ఇంద్రజ కౌగిలి
హృదయం విచ్చుకున్న ఉషస్సు ఎర్రని సూరీడు
రాత్రి కన్న కలలు రాలిపడిన రేల పూవులు
జడివానలో తడిసిన తనువు నిద్రాసుఖియై పవలించు
కామిని కలలలో బిగికౌగిలి గంధర్వం
చెలి కౌగిలిలో చెంగల్వపూదండ చిన్నికృష్ణుడు
ఇరు హృదయాల నిండా వసంతాల హరివిల్లులు
ఆనందో బ్రహ్మ,,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట