పగబట్టిన పడుచు !

కళ్ళు భగభగ మండే కాగడాలై
జనం గుండెలవిసి పోయే మాటలకు కర్ణభేరి పేలి భగ్గుమనగా
గుండెల్లో కణకన మండే మంటల సూరీడు వెర్రెక్కించగా
మగ మృగాళ్ల పైశాచిక కృత్యంలో ఓ మహిళ మాన ప్రాణాల రక్షణలేని సృజియించిన జన్మ ఆ సృష్టికర్త రాక్షసుడై ఉండాలి
బ్రతకలేక చావలేక జీవశ్చవమైన ఆడది
పగిలి బీటలుపడి అగ్నిగోళాలు రగులుతున్న గుండెలతో
ఒక్కో మగపురుగును తెగనరికేందుకు
కురులు వీరబోసుకుని జ్వాలాముఖియై
వెర్రిది పిచ్చిది అనే లోకం నడిరేయి కన్నుమూసాక
గండ్రగొడ్డలి చేతబూని మగ రాక్షసు లొక్కొక్కడిని కసితో
ఖండఖండాలు చేసి కాకులు గద్దలకు ఆహారంగా వేసేది ఆ స్త్రీయే
నిప్పుల కాష్టంలో మృగాళ్లను సజీవ దహనం చేసేది ఆ అబలే
తన నొసటి రాత రాసిన బ్రహ్మ దిమ్మతిరిగి కళ్ళుతిరిగి పడిపోవలసిందే
తన చూపులిపుడు సురకత్తుల బాకులు
లోకంనుండి వెలివేసిన పడుచు పగబట్టిన పులి సంచారం
లోకం మురికి కూపంలో దొర్లే పందులు
సత్యవంతులు నూటికో కోటికో
అగ్నిశిఖయై నరకటమే తన మార్గమిపుడు
నిప్పులు రాజేసి మృగాళ్లపై గుమ్మరించడమే తన ధ్యేయమిపుడు
ఆడది అబల కాదు నీ పంచేంద్రియాలను కాల్చి బూడిద చేసే ఆదిపరాశక్తి !!
రోడ్లపై అడ్డగాడిదల్లా తిరుగుతూ ఆడపిల్లల పాలిట యమకింకరులయ్యే బదులు
కష్టపడి ఇష్టమై చేసే పనులు కోకొల్లలు అయినా బుర్రకెక్కక పోతే ఎన్కౌంటర్ చేసే ఆడవాళ్ళు పుట్టుకొచ్చే రోజులొస్తున్నాయ్ తస్మాత్ జాగ్రత్తరా వెధవలు,,,,,,,!!

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *