పరమావధి

విద్య విజ్ఞాన సముపార్జనకు మూలం. ఆ విద్యనందించేది ఉపాధ్యాయులు. తమలోని జ్ఞానాన్ని జ్యోతిర్ముఖులై కర్పూరంలా కరిగిపోతూ వెలుగులు పంచుతూ విద్యార్థులను మహాన్నతులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులు.వాళ్ళను సభ్యసమాజం చులకనగా చూడటమే కాకుండా ,ప్రభుత్వ కార్యకలాపాలలో భాగస్వాములను చేస్తూ ఉపాధ్యాయుల విలువైన బోధనా సమయాన్ని హరించివేయడం తగదు.విద్యార్థుల భవిష్యత్తును బలితీసుకోవడం శోచనీయం. ఉపాధ్యాయుల్లో సగానికంటే ఎక్కువ మంది విద్యనందించడమే పరమావధిగా, జీవనోపాధిగా పనిచేస్తున్నారన్నది సత్యం.
అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *