మనస్సు నిండా మధురమైన ప్రేమ అనుభూతులు
నిండుగా తేనీయలు నిండిన తేనెపట్టు మనస్సు
తెలిసీ తెలియని యుక్తవయస్సులో గుమగుమలాడే గులాబీ మనస్సు
తేనెపట్టు నిండా తేనెటీగలు దాచుకున్న తేనీయలు తనివితీరా గ్రోలుతున్నట్లు ,,,,,,
మనస్సు గూడులోని ఆలోచనలు ప్రేమ మయూరాలు
కాని ఏ ఆర్థిక ఆధారంలేని, పరిపక్వతలేని యవ్వనంలో ప్రేమలు పొసగవు గదా,,,,,,
చదువులకు చెదలు తినేస్తూ నేల విడిచి సాముచేసినట్లు,,,,
ప్రేమలనే ఆకర్షణ వైఫల్యం చెంది ,,,,
మనస్సును సూదులు గుచ్చినట్లు ఆలోచనలు చెలరేగుతూ,,,,
ప్రేమించిన వ్యక్తి మోసం పదేపదే మనస్సు నిండా గిర్రున తిరుగుతూ క్రుంగదీసే మనోవ్యాకులత,,,,
ఆలోచనలు అగ్ని జ్వాలల్లా చెలరేగుతూ చంచల స్రవంతులై మనోనిబ్బరం కోల్పోతారు,,,,
లేత మనస్సులు తట్టుకోలేని చిన్న భగ్నప్రేమ జీవితాలను చిందరవందర చేస్తుంది,,,,,,
ప్రేమ ఊసులు గాలికబుర్లు, కలిసి తిరగడాలతో చదివే చదువులు గుర్తుకురాని వివర్ణమైన పుష్పం,,,,,
మనస్సు గూడు నిండా దయ్యపు ఆలోచనలు గుయ్యుమంటూ గందరగోళం,,,,,
తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుకుని ప్రయోజకులు అవుతారని కావలసినన్ని డబ్బులు ఇస్తూ పట్నం పంపిస్తే,,,,,
వీళ్ళు చేసిన వెధవ పనులను ప్రేమలనే పేరు చెప్పలేక చెబితే ఆలోచించండి,,,,,
తల్లిదండ్రుల గుండెల్లో గుబులు రేపుతూ సమాజంలో తలయెత్తుకోలేని స్థితి,,,,,,
ఈ సమయంలోనే అశ్రద్ధ చేయక పిల్లల మనస్సులను ఇంకా గాయపరచక సైకాలజిస్టులతో రెండు లేక మూడు సిట్టింగులు కౌన్సెలింగ్ ఇప్పిస్తే మనస్సు తేలికపడి మామూలు స్థితికి వస్తారు,,,,,,
అపరాజిత్
సూర్యాపేట