పల్లెసీమల్లో సంక్రాంతి,,,,,!
నవీన సంస్కృతి సంప్రదాయాలు
అమిత వేగంగా మార్పులకు లోనవుతూ
పల్లెసీమల్లో సంక్రాంతి పండుగ పెను మార్పుల సంబరం!
ఆడపడుచులు తెల తెలవారగానే కళ్లాపి చల్లి
వాకిలి నిండా ముగ్గుల పెట్టి
వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి
నవధాన్యాలు రేగుపళ్ళు పోసే ఆనందం !
పల్లెసీమల్లో కులవృత్తులు మూలపడ్డాయి
వ్యవసాయంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి!
మానవ సంబంధాలలో నూతన పోకడలు
పల్లెసీమలకు గొడ్డలి పెట్టులా పరిణమించినా
కుటుంబ సభ్యుల సంబంధ బాంధవ్యాలలో అంతగా మార్పులేదు
అన్నా చెల్లి అక్కా బావ అంటూ పిలిచే రూపు రేఖలు మారలేదు!
కొత్త అల్లుల్లు ఎక్కడున్నా పల్లెలకు రావలసిందే
తాటి కల్లు ఈత కల్లు తాగేవాళ్ళు తగ్గి
పల్లెల్లో కూడా విస్కీలు బీర్లు అమ్మే షావుకార్లు కోకొల్లలు
పండగొచ్చిందంటే కోడికూర లాంటివి బోలెడు
భాగ్యసీమ పల్లెసీమ ఆనందాల లోగిలి
ఆడపడుచులు చక్కగా ఆలంకరించుకుని
రకరకాల పిండి వంటలతో ముచ్చటగా మూడు రోజుల పండుగ
హరివిల్లు సొగసులతో చూడ చక్కగా జరుపుకుంటారు
రైతు పండించిన పంట ఇంటికి చేరిన సందర్భంలో
జరుపుకునే భోగి సంక్రాంతి కనుమ!
గంగిరెద్దుల వాళ్ళు డూడూబసవన్నలు హరిదాసులు
ఇప్పటికీ వాయిద్యాలు వాయిస్తూ ఇంటింటికి తిరుగుతూ
పల్లెసీమలకు పండుగ వాతావరణం కల్పించే సూత్రధారులు!
వినూత్న సంక్రాంతి సరిగమలు వర్ణించలేము సుమీ!
అపరాజిత్
సూర్యాపేట