అక్షర కొరకు
అంశం – నేటి పిల్లల ప్రవర్తన సామాజిక బాధ్యతలు
రచన – ఉమాదేవి ఎర్రం
శీర్షిక – పిల్లల చదువు
నేటి పిల్లలు చదవడమే
భారమని భావిస్తున్నారు
ఫోన్లు ఉంటే చాలు టి వి
లుంటే చాలు!
బయటి ఆటలు అసలే లేవు
ఇంట్లో కూడా వేరే ఆటలు లేవు
హోం వర్క్ రాయమంటే కోపం
టి వి కి బెడ్ కి అతుక్కోవడం!
దానికి తోడు స్కూలోలో ఇస్తారు
ప్రాజెక్ట్ వర్క్ ఉంటుందిక తల్లి
తండ్రులకు పాట్లు ఏమేం కావాలో
కొనుక్కు రావాలి తయారు చేయాలి!
పిల్లల కేమీ పట్టదు చేసేదంతా
పేరెంట్సే ఇంచ్లో చేయడం ఒక ఎత్తు
దాన్ని పదిలంగా స్కూలుకు చేర్చడం
మరో ఎత్తు చదివించడం మరో ఎత్తు!
వారికి భయం భక్తీ లేదు
గారాబం ఒకటే తెలుసు
చదువంటే భారమనే భావన
తల్లి తండ్రులకేమెా చదివించడమే
గొప్పనే వేదన!
ఇది నా స్వంత రచన అని హామీ ఇస్తున్నా!