పువ్వాడ శేషగిరిరావు (జూలై 12, 1906 – జనవరి 24, 1981) ప్రముఖ తెలుగు కవి, పండితులు. వీరు కవి పాదుషా బిరుదాంకితులు.
ఇతను 12 జూలై, 1906న మొవ్య మండలం, మొవ్వ గ్రామంలో సుందరరామయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. ఇతను ఉభయ భాషా ప్రవీణ పరీక్షలో ఉత్తీర్ణులై అధ్యాపక వృత్తిలో విశేషంగా రాణించారు. విజయవాడ హిందూ కళాశాలలోను, విజయనగరం మహారాజా కళాశాలలోను, బందరు హిందూ కళాశాలలోను, నేషనల్ కాలేజీ (ఆంధ్రజాతీయ కళాశాల) లలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసారు. వీరు చాలా పద్య, గద్య కావ్యాలు, నాటకాలను రచించారు. ఇతని రచనలు కొన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం, నాగార్జున విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉత్కళ విశ్వవిద్యాలయాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ, భాషా ప్రవీణ విద్యార్థులకు పాఠ్యగ్రంథాలుగా నిర్ణయం చేసారు.
ఇతని పెద తాతగారు పువ్వాడ రామదాసు మొవ్వ వేణుగోపాలస్వామి పై కీర్తనలు రచించి గానం చేశారు. వీరి రెండవ కుమారుడు పువ్వాడ తిక్కన సోమయాజి దుందుభి, జిగీష, సువర్ణ సౌరభం మొదలైన రచనలతో ప్రముఖుల ప్రశంసలందుకున్నారు.
పువ్వాడ శేషగిరిరావు 1981 జనవరి 24న బందరులో పరమపదించారు.
పద్య కావ్యాలు
గోవత్సము
తాజమహలు
దారా
శతపత్రము
పాలవెల్లి
అపశ్రుతులు
గద్య కృతులు
మధుకలశము
తెలుగు వెలుగులు
దీపకళికలు
పరశురాముడు
ఆంధ్ర తేజం (1934) : ఇది 1934 సంవత్సరంలో మారుతీ రాం అండ్ కో, బెజవాడ వారిచే ముద్రించబడింది. ఆంధ్రతేజాలైన తిక్కన, పోతన, శ్రీకృష్ణదేవరాయలు, తిమ్మరుసు, పల్నాటి పులి వంటివారి జీవితాలను ఆధారం చేసుకుని రాసిన కథలివి. ఐతే ఆంధ్రులు కాని పద్మిని గురించిన కథ కూడా చేర్చారు. ఇవి విద్యార్థుల కోసం కవి సంకలనం చేసిన జీవితచరిత్రలు.
ఏరువాక
ఔరా, ఎవరు?
ఉత్తరములు
బుర్రకథ
రక్త తర్పణం
నాటకాలు
పృథ్వీ పుత్రి
ప్రతాపరుద్రమదేవి
సహపంక్తి
నందనారీ
బిల్హణీయం
చదరంగం
సత్యప్రభ
లక్ష్మీ స్వయంవరం
తిస్సా పరిష్కారం
ఢిల్లీ దర్బార్.
1956 సంవత్సరంలో రిపబ్లిక్ దినోత్సవం నాడు జరిగిన జాతీయ కవి సమ్మేళానికి ఆహ్వానింపబడి సన్మానం పొందారు.
1975లో జరిగిన ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు వేదిక మీద ఘనంగా సన్మానం అందుకున్నారు.
‘ కవి పాదుషా ‘ బిరుదు పొందారు.
మాధవి కాళ్ల
సేకరణ