పుస్తక అధ్యయనం మౌన విప్లవం

అంశం : నేటి పిల్లలు సామాజిక బాధ్యత
శీర్షిక :పుస్తక అధ్యయనం మౌన విప్లవం,,,,,,!!
రచయిత అపరాజిత్ రెడ్డి

చదువు మేధాసంపత్తికి నిలయం
మనస్సు లోని చిందరవందర ఆలోచనలను ఏకీకృతం చేసి ఆలోచనా దృక్పథాన్ని జీవన శైలిని మహోన్నత దిశలోకి మార్చేది పుస్తక అధ్యయనం,,,,,,,,,
అధ్యయనం చేసే మనస్సు పూర్వ జ్ఞానాన్ని సమృద్ధి చేయడమో లేదా లోపాలను సరిదిద్దుకోవడమో చేస్తూ గుండెల్లో జ్ఞాన బాండాగారం నెలకొని నూతన ఒరవడిని వ్యక్తిత్వములో రూపుదిద్దుకుంటుంది ,,,,,,,,,,,,,,
పుస్తక అధ్యయనం జీవిత సాఫల్యంతో అంధకార ఆత్మలో వెలిగే జ్యోతి ప్రకాశం జ్వాలలు జీవిత గతులనే మార్చేస్తాయి,,,,,,,
జీవితంలో తోటివారితో వ్యవహరించే దృష్టిలో వాక్కులో గ్రాహ్యంలో ముఖకవళికల్లో పెనుమార్పులు సంభవిస్తాయి వినూత్న రీతిలో జీవితం సాగిపోతుంది,,,,,,,,,
చదువు సంస్కారం ఇవ్వడమే కాకుండా తన ముందున్న విద్యుక్తధర్మాన్ని నెరవేర్చేందుకు కావలసిన మెళకువలను నేర్పిస్తుంది,,,,,,,,,,
అధ్యయనం నీ లక్ష్యం వైపు దూసుకెళ్లేందుకు కావలసిన విషయ పరిజ్ఞానం ఎప్పటికప్పుడు అందిస్తూ ఇతరులకు మహోన్నత శిఖరాలు అనబడేవి నీకు సర్వసాధారణంగా అగుపిస్తాయి నీ పరిధిలోని పిల్లదారులే అవి అని తోస్తాయి,,,,,,,,,
నిరంతర అధ్యయనం నీ జీవితంలో పెను సవాళ్ళను సులువుగా ఎదుర్కొనేట్లు చేస్తుంది.ఏకాగ్రత ,దూరద్రుష్టి జీవితంలో లొసుగులు తొలగి ,అంధకారం నుండి వెలుగుల జ్ఞానంలోకి మేధాసంపన్నునివై సభ్యసమాజంలో విలువల జీవితం కొనసాగిస్తావు,,,,,,,,,,,

అపరాజిత్
సూర్యాపేట
హామీపత్రం : ఈ రచన నా కలం సేత యని నా హామీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *