పెట్రేగే కామకోరికలు

నీ కళ్ల లోపలి నుండి కమ్ముకొస్తున్న మైకం
ముఖం వాచిపోయే ఉవ్వెత్తున ఎగసిపడే కామకోరికలు కమ్ముకొస్తూ చీకటి యెదమాటున నల్లని గుర్రాలు పరుగులంకిస్తూ,,,,,
చీకటి మోము వెనుక మదిలో కామం కవ్విస్తోంది
పలుకలేని పెదవులు మనస్సు నిషాలో సన్నని కామ నాడులు తీసే వయోలిన్ రాగం మోములో పురివిప్పి నర్తిస్తూ,,,,,
విజృంభించే కోరికలు రంపపు కోత గుండెల్లో గుబులు రేపుతూ
మన్మథ తాపం నెమ్మది నెమ్మదిగా ముసురుకొస్తూ మనస్సు నిండా తనువు,,,,,
ఉసిగొలిపే చిత్తం చిత్త కార్తెలో కుక్క
దునుమాడే దున్న మనస్సు కోసే హృదయం ఆ అనుభవంకై ఉరకలేస్తున్న రాత్రి పుష్పించిన మరుమల్లియ,,,, ,,
చీకట్లు ముంచుకొస్తున్న మనస్సు పక్కన రేరాజు నిద్రకోసం తనువు తపనలు,,,,,
హృదయం అంజలి ఘటించి నిశరాత్రిని వేడుకుంటున్న పెనుగాయాలు మనస్సు లోతుల్లో మానిపోనివి,,,,,,
తలపుల తలరాతలు బ్రహ్మ లిఖితం పరిస్థితులు మార్చలేనివై గూడుకట్టుకున్న మథన తాపం,,,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *