పెద్దల పై గౌరవం

అక్షర కొరకు
అంశం – నేటి పిల్లలు సామాజిక బాధ్యత
రచన – ఉమాదేవి ఎర్రం

శీర్షిక – పెద్దల పై గౌరవం

నిజంగా ఈ కాలంలో పెద్దల పై పిల్లలకు గౌరవం లేకుండా పోయింది..
ఏ స్కూల్లో కూడా పెద్దలను గురించి ఏమీ చెప్పడం లేదు కానీ మా మనవడి స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే
అని ఒక ఫోగ్రాం నిర్వహించి భలే చేసారు..
స్కూలు పేరు శ్లోక పేరు కు తగ్గట్టే శ్లోకాలు భగవద్గీత అన్నీటి గురించి చెప్తున్నారు మా మనవడు నాలుగో తరగతి ..
పెద్దల పట్ల గౌరవం ప్రేమ గురించి బాగా చెప్పారు
అమ్మమ్మ లతో నానమ్మలతో తాతలతో అంత్యాక్షరి ఆటలు ఇంకా కొన్ని గేమ్స్ పెట్టారు నాకు మా మనవడి కి క్యాట్ వాక్ పెట్టారు గిఫ్ట్ లు కూడా ఇచ్చారు భలే సరదాగా అనిపించింది..
మాకు కూడా రెండిట్లో గిఫ్ట్ లు వచ్చాయి..
అలా పిల్లలకు నేర్పడం వలన వారిలో ప్రేమ భావం పెరుగుతుందని అనిపించింది..
ఈ విధంగా అన్ని స్కూల్లల్లో చేయిస్తే ఈ ఫోన్లలో ఆటలు అవి మరచి నానమ్మలతో తాతలతో గడుపుతారేమెా!
వెనుకటి రోజులు వస్తాయేమెా అనిపించింది..
నాకలా అనిపించింది మరి మీకెలా అనిపిస్తుంది? నేను
చెప్పిన ఈ విషయం పై…

ఇది నా స్వంత రచన..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *