పొద్దులు నింపిన వెలుగునై

పొద్దులు నింపిన వెలుగునై…!!!

కొలిమిగాల్చిన శగలతో కాలుతు
నిత్య సమ్మెట పోటులతో మొనదేలుతు
నొసటిరాతలు చేతి గీతలు చేయవని…!!
వాంచలకు తీరని ఆంక్షలకు తలొంచని
జీవితాన్ని నిఖార్సుగా రాసుకొనొచ్చాను…
రేకెత్తని ఈ సమాజాన్ని రూపు దిద్దుటకు…

పోసిన రంగునీళ్ళతో చిత్తవుతు
ఎత్తిన జెండాను భుజాన మోసుకొంటు…
సోమరి పెంచిన మనుషిగా బతుకవుతు…!!
పచ్బబొడిచిన పచ్చనోటుకై నిబద్దతనొదలి
చెప్పుకొలేని చరిత్రలు చెదలు బట్టిపోయి…
ఎవరో అరచేయికై ఎదురు చూడడం కాదు

పొద్దులు నింపిన వెలుగులనై
దుక్కిదున్నిన రైతన్నల జీవన భృతినై
అంతరాలు తెగిన యువకులకు పాదునై…!!
ఆకలి అన్నార్తులకై పుట్టిన పెనుమంటలనై
పేదోడు కలిపే కంచాన కవణమై నిండుతు…
కారణాల కర్తవ్యాలతో వేదమై వినబడతాను

కంటిమచ్చలతో మొలచిన చిత్రమై
కరువును మొలకెత్తించిన తొలకరినై…
తడిపిన నేలన పైరు పచ్చలనై పండుతు…!!
రాసిన రాజ్యాంగంతో నడిచే ప్రజాస్వామ్యమై
గడులలో నిలువక సెలయేటినై పారుతు…
దేశంకోసం ఎప్పుడు పుడతూనే ఉంటాను…

దేరంగుల భైరవ (కర్నూలు)
9100688396

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *