సృష్టిలో బడుగు మనిషి జీవితం ఆకలి మంటల సింహ ప్రస్థానం
కొమ్మల ఆకుల్లోంచి సూరీడు విరజిమ్మే కాంతుల్లో అతనొక అవనీపుత్రుడు
కదిలే పాదాలకు కూడా కళ్ళు పొడుచుకొచ్చాయేమో
నింపాదిగా నడిచివెళ్లే తీరు కళ్ళు జిగేల్మనేలా ఏ పోరుబాటకో వెళ్తున్న గర్జించే అడవి సింహంలా,,,,,,,
అతను వెళ్తున్నా కొలది పరుచుకుంటున్న నీడలే రహదారులు
ముళ్ల తుప్పలు రాలిపడుతున్న ఆకుల మధ్య మనోగవాక్షం నుండి రువ్వే ఆలోచనల తంత్రులలోంచి ఆవేశకావేశాలు,,,,,,,,,,
యువకిషోరం ఉడుకు రక్తం పొంగులో సమసమాజ స్థాపనకై దుష్టదుర్మార్గుల గుండెల్లో నిద్రపోవాలని తపన,,,,,,,,,,
ఈ దుష్టదుర్మార్గుల ప్రపంచాన్ని అవలీలగా జయించి ఆ మంటల సూరీడుకే వణుకు పుట్టించాలని ఉప్పొంగే నరాలు జివ్వుమంటుంటే జీవితం అగ్నిశిఖ,,,,,,,
అర్థం పర్థం లేని చదువులు సృష్టించిన నిరుద్యోగం నిప్పుల మీద నడకలా కారుచీకట్లోంచి ఉరుముల మెరుపులతో వెలుగుల్లోకి ,,,,,,,,,,,
ఎరుపెక్కిన యవ్వనం కళ్ళు ఉక్కు శరీరం కంటిమీద కునుకు లేక బలిసిన వాడి మేడలు గోడలు పీకేసేందుకు ఉవ్వెత్తున కెరటాలకు కెరటాలై సావాసగాళ్లతో ఎగిసిపడితే,,,,,,,,,
పోరాడితే పోయేదేంలేదు బానిస సంకెళ్లు తప్ప
కాని ఇది ప్రజాస్వామ్యం నెత్తురు కూటికి మరిగిన దళారి నాయకులు ఎన్కౌంటర్ లతో రాజ్యమేలే దగుల్బాజీలు ,,,,,,,,,,,,
పీడితులను మేల్కొలిపి పిడికిళ్ళు పైకెత్తి చేయి చేయి కలిపి ఉప్పెనలా ఎగిసిపడాలి తాడోపేడో తేల్చుకోవాలి
అపరాజిత్
సూర్యాపేట