మాను మాకు లేని ఈ భువిని
భయంకరమైన ఈదురుగాలులతో
నింగినిండా కారుమేఘాలు కమ్ముకుని
ఉరుములు మెరుపులు పిడుగులతో
ప్రకృతి విలయతాండవం చేస్తూ
నింగి నేలకు ఏకధారగా వర్షం
కుంభవృష్టితో భువినిండా కుమ్మరిస్తూ కుమ్మేస్తూ
సముద్రాలన్నీ అల్లకల్లోలమై తోసుకొస్తూ
సునామీలు పెట్రేగుతూ విరుచుకుపడుతూ
భూతలంపైకి ఉగ్రరూపంతో తోసుకొస్తూ
మనుషులు తమ టెక్నాలజీ సైన్స్
చీమలకన్నా హీనంగా కొట్టుకుపోతూ హాహాకారాలు
ఈ లోకం సమస్తం తుడిచిపెట్టుకుపోతూ
గర్జించే సింహంలా ప్రకృతి కన్నెర్ర చేస్తుంటే
ఈ ఉరుకులు పరుగుల జీవనయానం
ప్రకృతి భీభత్సంలో భూమిని కబళించివేస్తూ
మనిషన్నవాడి మేథస్సు కందని ప్రకృతి రహస్యం
మనిషి ప్రకృతి సమతుల్యత కాపాడుకోక
చెట్టుపుట్ట కబలిస్తూ విస్తరిస్తున్న జనాభ
అడవుల స్థానంలో ఆకాశహార్మ్యాలు వెళుస్తూ
జంతువులను పక్షులను సర్వం భక్షిస్తూ
ఇతర గ్రహాలపై జీవం జాడకై అన్వేషించే మనిషి
ఎంత మేథస్సు ఉంటేనేమి
తన ఉనికికే ప్రమాదం తెచ్చుకునే మూర్ఖుడు నరరూప రాక్షసుడు,,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట