అక్షర కొరకు
అంశం :- రిపబ్లిక్ డే
తేది:- 23/01/2026
శీర్షిక:- ప్రతి హృదయం
స్వేచ్ఛ గాలి ప్రతి ఊపిరిలో నిండెను
రాజ్యాంగం చేతిలో పట్టుకొని
భారత గణతంత్రం నిలిచెను గర్వంతో ఒలికెను
త్యాగాల రక్తంతో రాసిన చరిత్ర
వీరుల కలలే మన భవిష్యత్తు దారి
సమానత్వం, స్వాతంత్ర్యం, సౌభ్రాతృత్వం
ఇవే మన దేశానికి బలమైన మూలత్వం
త్రివర్ణ పతాకం ఆకాశంలో ఎగిరే వేళ
హృదయాలు దేశభక్తితో నిండే క్షణం అది
సైనికుల అడుగుల శబ్దంలో
దేశ రక్షణ సంకల్పం ప్రతిధ్వనించును
భాషలు వేరు, మతాలు వేరు అయినా
భారత మాత సంతానం మనమంతా ఒకటే
గ్రామం నుండి నగరం దాకా
అభివృద్ధి పథంలో ముందుకు సాగెను దేశం
రాజ్యాంగ విలువలు మన మార్గదర్శకాలు
న్యాయం మన చేతిలో వెలిగే దీపం
యువత ఆశలే దేశానికి ప్రాణం
వారి శ్రమే రేపటి స్వర్ణ కిరణం
గణతంత్ర దినోత్సవం గుర్తు చేయును
మన బాధ్యతలు, మన హక్కులు
దేశం కోసం జీవించు సంకల్పంతో
ప్రతి హృదయం స్పందించెను గర్వంతో
జై హో భారత మాతా
జై హో గణతంత్రం…
మాధవి కాళ్ల..
హామీ పత్రం :-
ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను.